Share News

World Athletics Championships 2025: స్టార్లతో కళకళ

ABN , Publish Date - Sep 13 , 2025 | 02:54 AM

ఒలింపిక్స్‌ తర్వాత అథ్లెటిక్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ప్రపంచ చాంపియన్‌షి్‌ప్స. విశ్వవ్యాప్త ప్రఖ్యాత అథ్లెట్ల సత్తాకు పరీక్షగా నిలిచే ఈ చాంపియన్‌షి్‌ప్స శనివారం టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 వరకు...

World Athletics Championships 2025: స్టార్లతో కళకళ

నేటి భారత షెడ్యూల్‌

ఉ. 4 గం.: పురుషుల 35 కి.మీ.

రేస్‌ వాక్‌-రాంబాబు, సందీప్‌; మహిళల 35 కి.మీ.

రేస్‌వాక్‌-ప్రియాంక గోస్వామి

సా. 4.30: మహిళల 1500 మీ. హీట్‌-పూజ

నేటినుంచి వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌

భారత్‌ ఆశలన్నీ నీరజ్‌పైనే

స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

టోక్యో: ఒలింపిక్స్‌ తర్వాత అథ్లెటిక్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ప్రపంచ చాంపియన్‌షి్‌ప్స. విశ్వవ్యాప్త ప్రఖ్యాత అథ్లెట్ల సత్తాకు పరీక్షగా నిలిచే ఈ చాంపియన్‌షి్‌ప్స శనివారం టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 వరకు జరిగే పోటీలలో 200 జట్ల నుంచి 2000 మంది అథ్లెట్లు తలపడుతున్నారు. 49 విభాగాలలో మొత్తం 147 పతకాలకోసం హోరాహోరీ పోరు జరగనుంది. షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌, షకారీ రిచర్డ్‌సన్‌, నోవా లైల్స్‌, కిషానే థాంప్సన్‌, సిడ్నీ మెక్‌లాలిన్‌, అర్మాండ్‌ డుప్లాంటిస్‌, నీరజ్‌ చోప్రా వంటి మేటి అథ్లెట్లు ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.

షెల్లీ ఘనంగా ముగిస్తుందా..?

ఈసారి వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో జమైకా స్ర్పింట్‌ దిగ్గజం, మహిళల 100 మీ. స్ర్పింట్‌ రారాణి షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌పై అందరి దృష్టి నిలిచింది. 38 ఏళ్ల స్టార్‌ ఈ పోటీల తర్వాత ట్రాక్‌ నుంచి రిటైర్‌ కానుంది. మూడు ఒలింపిక్‌, 10 ప్రపంచ చాంపియన్‌షి్‌ప్స స్వర్ణ పతకాల విజేత షెల్లీ టైటిల్‌తో ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని భావిస్తోంది. అలాగే మహిళల 100, 200 మీ.లలో అమెరికన్‌ క్వీన్‌ షకారీ రిచర్డ్‌సన్‌ ప్రధాన ఆకర్షణ కానుంది. గత వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో నెగ్గిన 100 మీ. టైటిల్‌ను నిలబెట్టుకోవాలని రిచర్డ్‌సన్‌ పట్టుదలగా ఉంది. గాయాలతో సతమతమవుతున్న పురుషుల 100.మీ., 200 మీ.ల డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవా లైల్స్‌ (అమెరికా) టైటిళ్లు నిలబెట్టుకుంటాడేమో చూడాలి. సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న జమైకా స్ర్పింటర్‌ కిషానే థామ్సన్‌..నొవాకు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. బరిలో దిగిన ప్రతి టోర్నీలో రికార్డులు నమోదు చేస్తున్న పురుషుల పోల్‌వాల్ట్‌ మొనగాడు ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ టోక్యోలో నెలకొల్పే రికార్డుపై ఉత్కంఠ ఏర్పడింది. ఇంకా భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా, మహిళల 400 మీ. హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డు గ్రహీత సిడ్నీ మెక్‌లాలిన్‌ (అమెరికా), మహిళల 1500, 5వేల మీ.లలో కిప్‌యేగాన్‌ (కెన్యా) మెరుపులు చూసి తీరాల్సిందే.


టైటిల్‌పై నీరజ్‌ గురి

భారత్‌ ఆశలన్నీ సూపర్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రాపైనే నిలిచాయి. 2023 బుడాపెస్ట్‌ ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో జావెలిన్‌ పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్‌.. ఆ టైటిల్‌ను నిలబెట్టుకోడమే థ్యేయంగా బరిలోకి దిగుతున్నాడు. అయితే పాకిస్థాన్‌కు చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌, చెక్‌ త్రోయర్‌ జాకబ్‌ వాల్టేచ్‌ల నుంచి నీరజ్‌కు తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ఇక..మొత్తం 19 మంది అథ్లెట్ల భారత బృందం టోక్యోలో తలపడుతోంది. కానీ పతక ఆశలు మాత్రం నీరజ్‌పైనే నిలిచాయి. ఈనెల 17న జావెలిన్‌ ఈవెంట్‌ మొదలు కానుంది. భారత్‌ నుంచి అన్నూరాణి (మహిళల జావెలిన్‌), పారుల్‌ చౌధరి (3000మీ స్టీపుల్‌ చేజ్‌), మురళీ శ్రీశంకర్‌ (లాంగ్‌ జంప్‌), గుల్వీర్‌ సింగ్‌ (5000మీ.), ప్రవీణ్‌ చిత్రవేల్‌ (ట్రిపుల్‌ జంప్‌) కూడా బరిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్

ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 13 , 2025 | 02:54 AM