Womens Chess World Cup: తొలి గేమ్‌లో హంపి దివ్యకు డ్రా
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:14 AM
మహిళల చెస్ వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత జీఎం కోనేరు హంపి, ఐఎం దివ్య దేశ్‌ముఖ్ తమ తొలి గేమ్‌లను డ్రాగా ముగించారు...
మహిళల చెస్ వరల్డ్‌కప్ సెమీస్
బటూమి (జార్జియా): మహిళల చెస్ వరల్డ్‌కప్ సెమీస్‌లో భారత జీఎం కోనేరు హంపి, ఐఎం దివ్య దేశ్‌ముఖ్ తమ తొలి గేమ్‌లను డ్రాగా ముగించారు. చైనా గ్రాండ్ మాస్టర్ లి టింగ్జీతో మంగళవారం జరిగిన సెమీస్ మొదటి క్లాసిక్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి సులువుగా గేమ్‌ను డ్రా చేసుకుంది. ఓపెనింగ్‌లోనే ప్రత్యర్థికి కోనేరు ఝలక్ ఇచ్చింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని టింగ్జీ తన బలగాలను సరిగా నడిపించలేక పోయింది. మిడిల్ గేమ్‌లో ఇద్దరూ క్వీన్‌లను కోల్పోయినా.. హంపి ఎక్కడా ఒత్తిడికి గురికాలేదు. మరో సెమీ్‌సలో చైనా జీఎం టోన్ జోంగ్‌యితో దివ్య పాయింట్ పంచుకొంది. బుధవారం కీలక రెండో క్లాసిక్ గేమ్ జరగనుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి