Woakes Apology: పంత్‌కు సారీ చెప్పా క్రిస్ వోక్స్
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:03 AM
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీ్‌సలో తమ గాయాలను పక్కనబెట్టి రిషభ్ పంత్, క్రిస్ వోక్స్ బరిలోకి దిగి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అయితే పంత్ గాయానికి కారణమైన తాను అతనికి సారీ చెప్పినట్టు...
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీ్‌సలో తమ గాయాలను పక్కనబెట్టి రిషభ్ పంత్, క్రిస్ వోక్స్ బరిలోకి దిగి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అయితే పంత్ గాయానికి కారణమైన తాను అతనికి సారీ చెప్పినట్టు వోక్స్ వెల్లడించాడు. నాలుగో టెస్టులో అతడి బౌలింగ్‌లోనే పంత్ రివర్స్ స్వీప్‌నకు యత్నించగా కాలిపాదం ఫ్రాక్చర్ అయ్యింది. అయినా పంత్ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగాడు. ఇక వోక్స్ కూడా ఐదో టెస్టు ఆఖరి రోజు బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. ‘నేను భుజం నొప్పితో బ్యాటింగ్‌కు దిగడాన్ని కెప్టెన్ గిల్ అభినందించాడు. ఇక ఇన్‌స్టాలో నా ఫొటోకు పంత్ సెల్యూట్ ఎమోజీ పెట్టాడు. దానికి నేను థ్యాంక్యూ చెప్పి.. నీ పాదం బాగానే ఉందని ఆశిస్తున్నా అని మెసేజ్ పంపా. అటు పంత్ కూడా తన వాయిస్ మెసేజ్‌లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని, మనం ఏదో రోజు కలుద్దామని అన్నాడు. నేను కూడా పాదం గాయం విషయంలో సారీ చెప్పా’ అని వోక్స్ వివరించాడు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి