Share News

కోహ్లీ.. కోలాహలం

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:22 AM

ఊహించినట్టే ఢిల్లీ రంజీ మ్యాచ్‌ను కోహ్లీ మేనియా కమ్మేసింది. విరాట్‌ కోసం ఫ్యాన్స్‌ భారీగా స్టేడియానికి తరలి రావడంతో.. దేశవాళీ క్రికెట్‌లో అరుదైన దృశ్యం గురువారం ఫిరోజ్‌ కోట్లా స్టేడియంలో...

కోహ్లీ.. కోలాహలం

  • పోటెత్తిన ఫ్యాన్స్‌, గేట్లవద్ద తోపులాట

  • రైల్వే్‌సతో ఢిల్లీ రంజీ మ్యాచ్‌

న్యూఢిల్లీ: ఊహించినట్టే ఢిల్లీ రంజీ మ్యాచ్‌ను కోహ్లీ మేనియా కమ్మేసింది. విరాట్‌ కోసం ఫ్యాన్స్‌ భారీగా స్టేడియానికి తరలి రావడంతో.. దేశవాళీ క్రికెట్‌లో అరుదైన దృశ్యం గురువారం ఫిరోజ్‌ కోట్లా స్టేడియంలో కనిపించింది. మైదానం మొత్తం కింగ్‌ నామస్మరణతో మార్మోగి పోయింది. గ్రూప్‌-డిలో ఢిల్లీ-రైల్వేస్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను వీక్షించేందుకు 15 వేల మందికిపైగానే తరలివచ్చారని అంచనా. ఆధార్‌ కార్డుతో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పించిన ఈ మ్యాచ్‌కు ఉదయం 7 గంటల నుంచే స్టేడియంవద్ద ఫ్యాన్స్‌ గుమికూడారు. ఆ తర్వాత జనాల రాక భారీగా పెరగడంతో 16వ గేటువద్ద కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో మరో గేట్‌ను తెరచి ఫ్యాన్స్‌ను లోపలికి పంపారు. ఈ సందర్భంగా ముగ్గురికి గాయాలయ్యాయి. వీరికి ప్రాధమిక చికిత్స చేశారు. ప్రేక్షకుల్ని నియంత్రించేందుకు పారామిలిటరీ సిబ్బందిని సైతం పిలిపించారు. అయితే, ఆటకు తొలి రోజే కోహ్లీ బ్యాటింగ్‌ చూడాలనివచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ ఆయుష్‌ బదోని ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఫ్యాన్స్‌ గేలి చేశారు.


కానీ, మ్యాచ్‌ మొదలైన తర్వాత టపటపా వికెట్లు పడుతుండడంతో అందరూ ఎంజాయ్‌ చేశారు. కోహ్లీ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఎంతో హుషారుగా కనిపించడంతో.. ప్రేక్షకులు కూడా తమ అభిమాన ప్లేయర్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆనందించారు. కాగా, 11వ ఓవర్‌లో ఓ అభిమాని ఫీల్డ్‌లోకి చొరబడి కోహ్లీ వద్దకు వెళ్లడంతో కలకలం రేగింది. విరాట్‌ కాళ్లకు నమస్కరిస్తున్న అతడిని సెక్యూరిటీ పట్టుకొని బయటకు తీసుకెళ్లింది. ఈ మ్యాచ్‌కు టీవీ కామెంటేటర్‌గా ఉన్న భారత మాజీ ఆటగాడు డబ్ల్యూవీ రామన్‌.. విరాట్‌ అభిమానగణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రంజీ మ్యాచ్‌కు ఇన్ని వేల మంది రావడం తాను ఎప్పుడు చూశానో కూడా గుర్తులేదన్నాడు.


కాగా, తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ 241 పరుగులకు ఆలౌటైంది. ఉపేంద్ర (95), కర్ణ్‌ శర్మ (50) హాఫ్‌ సెంచరీలు చేశారు. సైనీ, మాధుర్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఢిల్లీ మొదటి రోజు ఆట ఆఖరికి 41/1 స్కోరు చేసింది. రెండో రోజు విరాట్‌ బ్యాటింగ్‌కు దిగడం ఖాయం కావడంతో ఫ్యాన్స్‌ మరింతగా పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు.


ఇదీ చదవండి:

నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు

కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..

ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 03:22 AM