Andhra Premier League: వారియర్స్ బోణీ
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:55 AM
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో తుంగభద్ర వారియర్స్ బోణీ కొట్టింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో వారియర్స్ 7 వికెట్లతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై గెలిచింది...
ఏపీఎల్‌లో లయన్స్ పరాజయం
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో తుంగభద్ర వారియర్స్ బోణీ కొట్టింది. ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో వారియర్స్ 7 వికెట్లతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై గెలిచింది. తొలుత లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 109 పరుగులే చేసింది. అభిషేక్‌రెడ్డి (40) ఫర్వా లేదనిపించాడు. ఛేదనలో వారియర్స్ 12.2 ఓవర్లలోనే 114/3 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ మహీ్‌పకుమార్ (57 నాటౌట్) రాణించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ ఏడు వికెట్లతో రాయల్స్ ఆఫ్ రాయలసీమను ఓడించింది. మొదట రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 రన్స్ చేసింది. అవినాష్ (96) ఆకట్టుకున్నాడు. ఛేదనలో సన్‌షైనర్స్ 16.5 ఓవర్లలోనే 200/3 స్కోరు చేసి నెగ్గింది. కెప్టెన్ అశ్విన్ హెబ్బర్ (98) కొద్దిలో శతకం చేజార్చుకోగా, తేజ (77 నాటౌట్) సత్తా చాటాడు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి