Virat Kohlis Century Boost Ticket Sales: ఆ సెంచరీతో సీన్ మారింది
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:21 AM
భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమం కావడంతో.. విశాఖలో జరిగే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఈ నేపథ్యం లో సాగర తీరాన జరిగే మ్యాచ్ టిక్కెట్లు హాట్‌హాట్‌గా...
విశాఖపట్నం (స్పోర్ట్స్): భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమం కావడంతో.. విశాఖలో జరిగే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఈ నేపథ్యం లో సాగర తీరాన జరిగే మ్యాచ్ టిక్కెట్లు హాట్‌హాట్‌గా అమ్ముడయ్యా యి. టెస్ట్ సిరీ్‌సలో టీమిండియా వైట్‌వాష్ కావడంతో.. తొలుత టిక్కెట్ల విక్రయాలు ఆరంభించినప్పుడు అంతగా స్పందన లభించలేదు. కానీ, మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ సెంచరీ బాదడంతో క్రమంగా అమ్మకాలు ఊపందుకొన్నాయి. ఇక, రాయ్‌పూర్‌లో విరాట్ వరుసగా రెండో సెంచరీ నమోదు చేయడంతో.. టిక్కెట్లకు డిమాండ్ ఆకాశాన్నంటింది. గత నెల 28న తొలి విడత టిక్కెట్ల విక్రయాలు ప్రారంభించినప్పుడు డిమాండ్ అంతగా లేదు. కానీ రాంచీలో భారత్ మ్యాచ్ నెగ్గడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రెండో దఫా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచిన నిమిషాల్లోనే అన్నీ అమ్ముడుపోయాయని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వర్గాలు తెలిపాయి. ఇదే అదనుగా కొందరు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News