Share News

Virat Kohli: ఆస్ట్రేలియా వన్డే టూర్.. కింగ్ కోహ్లీ ట్వీట్.. ఇక చెడుగుడే

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:56 AM

మరి కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మొదలవుతుందనంగా కోహ్లీ నెట్టింట భావోద్వేగ పూరిత పోస్టు పెట్టాడు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Virat Kohli: ఆస్ట్రేలియా వన్డే టూర్.. కింగ్ కోహ్లీ ట్వీట్.. ఇక చెడుగుడే
Virat Kohli cryptic post

ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో దూకుడుకు పర్యాయ పదంగా నిలిచే కోహ్లీకి త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా వన్డే టూర్‌ అత్యంత కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ చేసిన భావోద్వేగ పూరిత ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అభిమానులో వ్యక్తిగత విషయాలను పెద్దగా పంచుకోని కోహ్లీ తను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంఘర్షణపై నెట్టింట కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది (Virat Kohli Australia One Day Series Tour).

వైఫల్యానికి తాను ఇచ్చే నిర్వచనంపై కోహ్లీ ఈ పోస్టు పెట్టాడు. ‘ఓటమిని అంగీకరించినప్పుడే నిజమైన వైఫల్యం’ అని కామెంట్ చేశాడు. తనలో భావోద్వేగాల తీవ్రత ఎంతగా ఉందో చెప్పుకొచ్చాడు. దీంతో, ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కోహ్లీకి మద్దతుగా నిలిచారు.

కోహ్లీ ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే వేల కొద్దీ లైకులు, కామెంట్స్ వచ్చిపడ్డాయి. కింగ్ కోహ్లీకి అండగా నిలుస్తూ ఫ్యాన్స్ పలు కామెంట్స్ చేశారు. పోరాటం మానొద్దని పిలుపునిచ్చారు. గతంలో జట్టు క్లిష్ట సమయాల్లో అతడు ప్రదర్శించిన పోరాట పటిమ, నాయకత్వ దక్షతను గుర్తు చేసుకున్నారు. 2027 ట్రోఫీని కోహ్లీ లేవనెత్తాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.


పెర్త్, అడలెయిడ్, సిడ్నీ వేదికల్లో ఆస్ట్రేలియాతో మూడు వన్డే సిరీస్‌‌లో భారత్ తలపడనుంది. ఆదివారం ఈ సిరీస్ మొదలు కానుంది. ఆ తరువాత మరో ఐదు టీ30 మ్యాచుల సిరీస్ కూడా ఉంది. అయితే, ఈ సిరీస్‌లో కోహ్లీతో పాటు రోహిత్ పునరాగమనం చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పతాక స్థాయికి చేరుకుంది. ఆస్ట్రేలియాలో కోహ్లీ విజృంభించేందుకు డిసైడయ్యాడని అభిమానులు చెబుతున్నారు. ఇందుకు తాజాగా ట్వీట్ నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.

ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. 57.88 సగటుతో 14,181 పరుగులు చేశారు. 93 స్ట్రైక్ రేటుతో 51 సెంచరీలు, 74 అర్థశతకాలతో తన సత్తా చాటాడు. ఇక ఆస్ట్రేలియాలో ఆడిన 29 వన్డేల్లో కోహ్లీ 1327 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై అతడి బెస్టు స్కోరు 133.


ఇవి కూడా చదవండి

Commonwealth Games 2030: అహ్మదాబాద్‌లో కామన్వెల్త్‌ క్రీడలు

India Team Departs for Australia: ఆసీస్‌కు పయనం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 12:17 PM