Share News

ఆ చరిత్రనే మార్చి

ABN , Publish Date - May 13 , 2025 | 05:49 AM

ఆటగాడిగా, భారత జట్టు సారథిగా కోహ్లీ హయాంలో టీమిండియా సరికొత్త స్థాయిలను అందుకొంది. భారత టెస్ట్‌ చరిత్రలో విరాట్‌ది ఓ విప్లవమనే చెప్పుకోవాలి. అత్యున్నత ఫిట్‌నెస్‌ ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు గెలవాలన్న కసిని జట్టులో...

ఆ చరిత్రనే మార్చి

దిగ్గజ ఆటగాడిగా.. అంతకుమించి కెప్టెన్‌గా!

ఆటగాడిగా, భారత జట్టు సారథిగా కోహ్లీ హయాంలో టీమిండియా సరికొత్త స్థాయిలను అందుకొంది. భారత టెస్ట్‌ చరిత్రలో విరాట్‌ది ఓ విప్లవమనే చెప్పుకోవాలి. అత్యున్నత ఫిట్‌నెస్‌ ప్రమాణాలను నెలకొల్పడంతోపాటు గెలవాలన్న కసిని జట్టులో పెంపొందించడంలో విజయవంతమయ్యాడు. ప్రపంచ టెస్ట్‌ జట్లలో టీమిండియాను బలీయమైన శక్తిగా తీర్చిదిద్దాడు. బలమైన బౌలింగ్‌ విభాగాన్ని తయారు చేసి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించాడు. ఒకప్పుడు భారత జట్టు పర్యటనకు వస్తుందంటే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు తమదే విజయమని భావించేవి. కానీ, కోహ్లీ హయాంలో లెక్కమారింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన భారత్‌.. 71 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇక, బ్యాటర్‌గా కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో ఘనతలను అందుకొన్నాడు.


వెస్టిండీ్‌సపై అరంగేట్రం..: 2011 జూన్‌లో వెస్టిండీ్‌సతో జరిగిన తొలి మ్యాచ్‌ (కింగ్‌స్టన్‌)లో విరాట్‌ టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. ఆ సిరీ్‌సలో ఫర్వాలేదనిపించిన కోహ్లీ.. క్రమంగా జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకొన్నాడు. స్వదేశం, విదేశాల్లో టీమిండియా రన్‌ మెషీన్‌గా మారాడు. 2012 ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో కోహ్లీ తొలి శతకం నమోదు చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీలో చివరి టెస్ట్‌ ఆడాడు. కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడిన విరాట్‌.. 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధికం 254 రన్స్‌. వంద టెస్ట్‌లకుపైగా ఆడి 55.57 స్ట్రయిక్‌ రేట్‌ నమోదు చేయడం అద్భుతం. అయితే, గత కొన్నేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ ప్రదర్శన దిగజారింది. 2024-25 ఆసీస్‌ పర్యటనలో విరాట్‌ ఒక్క సెంచరీ మాత్రమే నమోదు చేశాడు.

డబుల్‌ సెంచరీ కింగ్‌..: భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధికంగా ఏడు ద్విశతకాలు నమోదు ఆటగాడు కోహ్లీ. 2019లో పుణెలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో విరాట్‌ 254 పరుగులతో కెరీర్‌లో తొలి డబుల్‌ సాధించాడు. అంతేకాకుండా నాలుగు వరుస సిరీ్‌సల్లో నాలుగు డబుల్‌ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో డాన్‌ బ్రాడ్‌మన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ మూడు వరుస సిరీ్‌సల్లో మూడు ద్విశతకాల రికార్డును అధిగమించాడు.


కెప్టెన్‌గా రికార్డులు..: 2014, డిసెంబరులో ఆస్ట్రేలియా టూర్‌లో ధోనీ అర్ధంతరంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. కోహ్లీ జట్టు పగ్గాలందుకొన్నాడు. అనతికాలంలోనే రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో భారత్‌ బలమైన శక్తిగా మారింది. స్వదేశంలో తిరుగులేని భారత్‌ క్రమంగా విదేశాల్లోనూ సిరీస్‌ విజయాలతో ఆధిపత్యం చెలాయించింది. 2018-19లో జరిగిన టెస్ట్‌ సిరీ్‌సలో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై 2-1తో ఓడించిన భారత్‌.. 71 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికాల్లో కూడా భారత్‌ విజయాలను అందుకొంది. టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ నెం:1 స్థానానికి చేరుకొంది. 2021లో లార్డ్స్‌ టెస్టులో భారత్‌కు అద్భుత విజయం అందించాడు.

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For Sports News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:49 AM