రికార్డుల కింగ్
ABN , Publish Date - May 13 , 2025 | 05:43 AM
టెస్టుల్లో విరాట్ సాధించిన డబుల్ సెంచరీలు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ ద్విశతకాలు సాధించిన ఆటగాడు కోహ్లీనే. అంతేకాదు.. వరుసగా నాలుగు టెస్ట్ సిరీ్‌సలలో డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్ కూడా...
7
టెస్టుల్లో విరాట్ సాధించిన డబుల్ సెంచరీలు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ ద్విశతకాలు సాధించిన ఆటగాడు కోహ్లీనే. అంతేకాదు.. వరుసగా నాలుగు టెస్ట్ సిరీ్‌సలలో డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్ కూడా అతడే. ఈ క్రమంలో డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ పేరిటనున్న వరుస మూడు డబుల్ సెంచరీల రికార్డును విరాట్ అధిగమించాడు.
20
ప్టెన్ హోదాలో కోహ్లీ కొట్టిన సెంచరీలు. టీమిండియా సారథిగా అత్యధిక శతకాల వీరుడు విరాటే. సునీల్ గవాస్కర్ (11)ది రెండోస్థానం.
40
విరాట్ సారథ్యంలో టీమిండియా గెలిచిన టెస్టుల సంఖ్య. 68 మ్యాచుల్లో ఈ ఘనతను అందుకున్న కోహ్లీ.. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు.
5,864
కెప్టెన్‌గా విరాట్ టెస్టుల్లో కొల్లగొట్టిన పరుగులు. ఇందులో 20 శతకాలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన సారథి కోహ్లీనే. ధోనీ (3,454), సునీల్ గవాస్కర్ (3,449) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
9,230
టెస్టుల్లో కోహ్లీ చేసిన పరుగులు. సచిన్, ద్రవిడ్, గవాస్కర్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు.
ఇవి కూడా చదవండి..
AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For Sports News And Telugu News