Share News

కోహ్లీ నా ఫేవరెట్‌

ABN , Publish Date - May 13 , 2025 | 05:34 AM

ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంవో) రాజీవ్‌ ఘాయ్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్థావన తెచ్చారు. అలాగే 70వ దశకంలో...

కోహ్లీ నా ఫేవరెట్‌

డీజీఎంవో రాజీవ్‌ ఘాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంవో) రాజీవ్‌ ఘాయ్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్థావన తెచ్చారు. అలాగే 70వ దశకంలో ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన యాషెస్‌ సిరీ్‌సనూ ఆయన గుర్తు తెచ్చుకున్నారు. 14 సంవత్సరాల సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు విరాట్‌ సోమవారం అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. విలేకరుల భేటీలో కోహ్లీ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రస్తావించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ ‘విరాట్‌ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఎందరో భారతీయుల మాదిరే నాకూ ఆయన ఫేవరెట్‌ క్రికెటర్‌’ అని అన్నారు. ఇక..1970 యాషెస్‌ సిరీ్‌సలో ఇంగ్లండ్‌ జట్టును ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లు షేన్‌ థాంప్సన్‌, డెన్నిస్‌ లిల్లీ వణికించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని థాంప్సన్‌, లిల్లీ ప్రతిభతో పోలుస్తూ ఘాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘1970ల్లో నేను పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల నడుమ యాషెస్‌ సిరీస్‌ జరిగింది. ఆసీస్‌ జట్టులోని అప్పటి ప్రఖ్యాత పేసర్లు థాంప్సన్‌, లిల్లీ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశారు.


దాంతో ‘యాషెస్‌ టు యాషెస్‌ : డస్ట్‌ టు డస్ట్‌ : లిల్లీకి దొరక్కపోతే థాంప్సన్‌కు తప్పకుండా చిక్కుతారు’ అని ఆస్ట్రేలియా చక్కని పద ప్రయోగం చేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌పై పోరాటంలో భారత్‌ ఆధిపత్యాన్ని ఆ విధంగా వర్ణించవచ్చు’ అని రాజీవ్‌ ఘాయ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For Sports News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:34 AM