Virat and Anushkas Visit to India: భారత్ విచ్చేసిన విరుష్క జోడీ మెస్సీని కలిసేందుకేనా
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:29 AM
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కొద్ది రోజుల కిందటే విరాట్ స్వదేశానికి విచ్చేశాడు. సరిగ్గా..గత శనివారం విశాఖపట్నంలో ఆఖరి వన్డే ముగిసిన అనంతరం అతడు తిరిగి ఇంగ్లండ్...
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం కొద్ది రోజుల కిందటే విరాట్ స్వదేశానికి విచ్చేశాడు. సరిగ్గా..గత శనివారం విశాఖపట్నంలో ఆఖరి వన్డే ముగిసిన అనంతరం అతడు తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. మళ్లీ వారం తిరిగే సరికి..అంటే శనివారంనాడు భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ భారత్ వచ్చాడు. ముంబైలోని కలినా విమానాశ్రయం నుంచి భార్యతో కలిసి విరాట్ బయటకు వస్తున్న దృశ్యాల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారంలోనే కోహ్లీ తిరిగి భారత్ రావడం..అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీని కలిసేందుకేనన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మెస్సీ మూడు రోజుల భారత పర్యటన శనివారం మొదలైన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబైలో మెస్సీ కార్యక్రమాలున్నాయి. ఈనేపథ్యంలో మెస్సీని కలిసేందుకే భార్య సహా విరాట్ వచ్చాడని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: