Share News

Irani Cup: ఇరానీ విజేత విదర్భ

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:43 AM

ఇరానీ కప్‌ను విదర్భ గెలుచుకుంది. ఇక్కడ ముగిసిన ఐదు రోజుల మ్యాచ్‌లో 93 పరుగులతో రెస్టాఫ్‌ ఇండియా ఓడించింది. 361 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 30/2తో ఆదివారం...

Irani Cup: ఇరానీ విజేత విదర్భ

నాగ్‌పూర్‌: ఇరానీ కప్‌ను విదర్భ గెలుచుకుంది. ఇక్కడ ముగిసిన ఐదు రోజుల మ్యాచ్‌లో 93 పరుగులతో రెస్టాఫ్‌ ఇండియా ఓడించింది. 361 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్‌ స్కోరు 30/2తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెస్ట్‌ 267 రన్స్‌కు ఆలౌటైంది. యశ్‌ ధుల్‌ (92), మానవ్‌ సుతార్‌ (56 నాటౌట్‌) పోరాడినా ‘రెస్ట్‌’కు ఓటమి తప్పలేదు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 104 రన్స్‌ జోడించారు.

సంక్షిప్తస్కోర్లు: విదర్భ: 342, 232; రెస్టాఫ్‌ ఇండియా: 214, 267 (ధుల్‌ 92, మానవ్‌ 56 నాటౌట్‌, ఇషాన్‌ 35, హర్ష్‌ దూబే 4/73, ఆదిత్య ఠాక్రే 2/27, యశ్‌ ఠాకూర్‌ 2/47).

యశ్‌-ధుల్‌ కొట్టుకోబోయారు!

ఆఖరిరోజు ఆటలో విదర్భ పేసర్‌ యశ్‌ ఠాకూర్‌, రెస్ట్‌ బ్యాటర్‌ యశ్‌ ధుల్‌ కొట్టుకుకున్నంత పని చేశారు. ఠాకూర్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతికి ధుల్‌ క్యాచవుటయ్యాడు. కీలకమైన వికెట్‌ పడగొట్టిన నేపథ్యంలో ఠాకూర్‌ తీవ్రంగా స్పందించాడు. అది జీర్ణించుకోలేని ధుల్‌..ఠాకూర్‌పై దాడి చేసేందుకు అతడివైపు దూసుకు పోయాడు. ఠాకూర్‌ కూడా తగ్గేదిలేన్నట్టుగా జవాబివ్వడంతో ఇద్దరూ కొట్టుకొనేదాకా వెళ్లారు. అయితే అంపైర్లు కలుగజేసుకొని వారిని విడదీశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 02:46 AM