Share News

National Senior Badminton Championship: వెన్నెల జోడీ ముందంజ

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:04 AM

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప డబుల్స్‌లో కె.వెన్నెల రెడ్డి (తెలంగాణ)-రిషిక (తమిళనాడు) జోడీ ప్రీక్వార్టర్స్‌లోకి...

National Senior Badminton Championship: వెన్నెల జోడీ ముందంజ

విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప డబుల్స్‌లో కె.వెన్నెల రెడ్డి (తెలంగాణ)-రిషిక (తమిళనాడు) జోడీ ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోటీల్లో వెన్నెల-రిషిక ద్వయం 21-12, 21-19తో అనన్య-మనీషా (జార్ఖండ్‌) జోడీపై గెలిచింది. సింగిల్స్‌లో ఉన్నతి హూడా (హరియాణా) 21-11, 21-18తో అశ్వతి (కర్ణాటక)పై, తన్వీ శర్మ (పంజాబ్‌) 21-15, 9-21, 21-12తో మాన్సీ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌)పై, రోహన్‌ కుమార్‌ (తెలంగాణ) 13-21, 21-13, 21-14తో అన్ష్‌ నేగి (ఉత్తరాఖండ్‌) నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు.. పురుషుల డబుల్స్‌లో విష్ణు కేదార్‌-వెంకట హర్షవర్దన్‌ (ఆంధ్రప్రదేశ్‌), కార్తీకేయ-పూజిత్‌ రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌), భార్గవ్‌ రామ్‌-విశ్వతేజ (ఆంధ్రప్రదేశ్‌), వర్షిత్‌ శ్రీసాయి-తరుణ్‌ (తెలంగాణ), మహిళల డబుల్స్‌లో స్రవంతి-దీపిక జోడీ ముందంజ వేశాయి.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..

Updated Date - Dec 26 , 2025 | 06:05 AM