Vaibhav Suryavanshi: వైభవ్ 310 స్ట్రయిక్ రేట్‌తో
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:41 AM
క్రికెట్‌లో వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తున్న యువ బ్యాటింగ్ సంచలనం వెభవ్ సూర్యవంశీ (బిహార్) 300కుపైగా స్ట్రయిక్ రేట్‌తో ఔరా అనిపించాడు. విజయ్ హజారే టోర్నీలో...
రాంచీ: క్రికెట్‌లో వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తున్న యువ బ్యాటింగ్ సంచలనం వెభవ్ సూర్యవంశీ (బిహార్) 300కుపైగా స్ట్రయిక్ రేట్‌తో ఔరా అనిపించాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా సోమవారం ఇక్కడ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లో 31 పరుగులు చేయడం ద్వారా 310 స్ట్రయిక్ రేట్ నమోదు చేశాడు. అయితే ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌ను వైభవ్ కొనసాగించ లేకపోయాడు. అదే స్కోరు వద్ద క్యాచవుటయ్యాడు. ఇక..218 పరుగుల ఛేదనను బిహార్ 32.3 ఓవర్లలో 220/2 స్కోరుతో ముగించింది.
ఇవి కూడా చదవండి
రిటైర్‌మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
మూడో రౌండ్ నుంచి రో-కో ఔట్.. కారణం ఏంటంటే..?