US Open Final 2025: ఇక్కడా ఆ ఇద్దరే
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:36 AM
ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ తుది పోరులోనూ నువ్వా.. నేనా? అని తేల్చుకునేందుకు వరల్డ్ నెంబర్ వన్ యానిక్ సినర్, నెంబర్ టూ కార్లోస్ అల్కారజ్ సిద్ధమయ్యారు. ఈ ఏడాది...
సెమీ్‌సలో జొకోవిచ్‌కు ఝలక్
పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ నేడు
రాత్రి 11.30 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..
యూఎస్ ఓపెన్
వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అల్కారజ్ గీ సినర్
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ తుది పోరులోనూ నువ్వా.. నేనా? అని తేల్చుకునేందుకు వరల్డ్ నెంబర్ వన్ యానిక్ సినర్, నెంబర్ టూ కార్లోస్ అల్కారజ్ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లో తలపడిన ఈ ఇద్దరు.. చెరో టోర్నీ నెగ్గారు. తాజాగా యూఎస్ ఓపెన్ టైటిల్ ఫైట్‌లోనూ ఢీకొంటున్నారు. తద్వారా ఒకే సీజన్‌లో మూడు వరుస గ్రాండ్‌స్లామ్స్ ఫైనల్స్‌లో తలపడుతున్న ఆటగాళ్లుగా సినర్-అల్కారజ్ రికార్డులకెక్కారు. ఆదివారం జరిగే అంతిమ పోరులో విజేత ఎవరో తేలనుంది. డిఫెండింగ్ చాంపియన్ సినర్‌కిది వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. ఇక.. రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న 38 ఏళ్ల నొవాక్ జొకోవిచ్‌కు మరోసారి భంగపాటే ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం అల్కారజ్ 6-4, 7-6(4), 6-2తో వరుస సెట్లలో మాజీ చాంపియన్ జొకోవిచ్‌ను ఓడించాడు. మరో సెమీఫైనల్లో ఫెలిక్స్ అలియాసిమి (కెనడా)ని ఓడించేందుకు ఇటలీ స్టార్ సినర్ నాలుగు సెట్ల పాటు కష్టపడ్డాడు. కొద్దిసేపు మెడికల్ టైమ్ అవుట్ తీసుకున్న సినర్ చివరకు 6-1, 3-6, 6-3, 6-4తో గట్టెక్కి వరుసగా రెండోసారి ఇక్కడ ఫైనల్ చేరాడు. కెరీర్‌లో 300వ విజయం అందుకున్న సినర్‌కు ఇది వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం. నిరుడు యూఎస్ ఓపెన్ నెగ్గిన సినర్.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచాడు. ఆ వెంటనే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినా, అల్కారజ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అనంతరం వింబుల్డన్‌లోనూ తుదిపోరుకు దూసుకెళ్లిన సినర్.. అల్కారస్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు.

పోరాటం ఆపను..
ఈ సీజన్‌లో జొకోవిచ్ నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ సెమీ్‌సకు చేరినా.. అతడి పోరు అక్కడితోనే ఆగిపోయింది. ఇందులో రెండుసార్లు సినర్ (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), ఓసారి అల్కారజ్ (యూఎస్ ఓపెన్) చేతిలో ఓడిన జొకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జ్వెరెవ్‌తో సెమీ్‌సలో గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. ఇలా.. 25వ స్లామ్‌ను ఖాతాలో చేర్చుకోవాలన్న జొకో భగీరథ ప్రయత్నాలకు ఈ యువతరం స్టార్లు అడ్డుపడుతున్నారు. అయినా కూడా గ్రాండ్‌స్లామ్స్‌లో తన పోరాటాన్ని ఆపేది లేదని అంటున్నాడు జొకో. తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశం లేదని, వచ్చే ఏడాది కూడా అన్ని మేజర్ టోర్నీల్లో ఆడాలనుకుంటున్నట్టు జొకో స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..