ఎదురులేని స్వియటెక్, సిన్నర్
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:12 AM
డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్, మహిళల హాట్ ఫేవరెట్ ఇగా స్వియటెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకు పోయారు. అలాగే 21వ సీడ్ బెన్ షెల్టన్, 19వ సీడ్ మాడిసన్ కీస్ కూడా...
సెమీ్‌సలో ప్రవేశం ఆస్ట్రేలియన్ ఓపెన్
నేడు మహిళల సెమీఫైనల్
సబలెంక్ఠబడోసా (మ.2 ) స్వియటెక్ఠ్‌కీస్ (మ.3.10)
మెల్‌బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్, మహిళల హాట్ ఫేవరెట్ ఇగా స్వియటెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు దూసుకు పోయారు. అలాగే 21వ సీడ్ బెన్ షెల్టన్, 19వ సీడ్ మాడిసన్ కీస్ కూడా సెమీ్‌సలోకి అడుగుపెట్టారు. 23 ఏళ్ల పోలెండ్ భామ స్వియటెక్ ఈసారి మెల్‌బోర్న్ పార్క్‌లో తిరుగులేని విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం స్వియటెక్ అద్భుత ప్రదర్శనకు అర్థం పడుతుంది. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్‌ఫైనల్లో..ఐదు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ స్వియటెక్ 6-1, 6-2తో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)ను చిత్తు చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో 19వ సీడ్ కీస్‌తో స్వియటెక్ అమీతుమీ తేల్చుకుంటుంది..
మరో క్వార్టర్స్‌లో కీస్ (అమెరికా) 3-6, 6-3, 6-4తో 28వ సీడ్ స్విటోలినా (ఉక్రెయిన్)న్‌పై నెగ్గింది. పురుషుల క్వార్టర్‌ఫైనల్లో టాప్ సీడ్ సిన్నర్ (ఇటలీ) 6-3, 6-2, 6-1తో అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో 21వ సీడ్ షెల్టన్‌ను సిన్నర్ ఎదుర్కొంటాడు. ఇంకో క్వార్టర్‌ఫైనల్లో షెల్టన్ (అమెరికా) 6-4, 7-5, 4-6, 7-6 (4)తో లోరెంజో సొనేగో (ఇటలీ)పై గెలిచాడు. పురుషుల రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ జ్వెరేవ్-ఏడో సీడ్ జొకోవిచ్ తలపడతారు.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
స్టార్ బౌలర్ కెరీర్ క్లోజ్.. అంతా ప్లాన్ ప్రకారమే
భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి