Share News

Odisha Masters Super 100: ఫైనల్లో ఉన్నతి, ఇషా

ABN , Publish Date - Dec 14 , 2025 | 02:43 AM

ఒడిశా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఇషారాణి బరూచ మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల్లో భారత్‌కు చెందిన ...

Odisha Masters Super 100: ఫైనల్లో ఉన్నతి, ఇషా

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఇషారాణి బరూచ మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల్లో భారత్‌కు చెందిన కిరణ్‌ జార్జ్‌ టైటిల్‌పోరులో నిలిచాడు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ ఉన్నతి 18-21, 21-16, 21-16తో భారత్‌కే చెందిన తస్నీమ్‌ మీర్‌పై విజయం సాధించగా.. ఇషారాణి 18-21, 21-7, 21-7తో సహచర షట్లర్‌ తన్వీ హేమంత్‌ను ఓడించాడు. పురుషుల సింగిల్స్‌ సెమీ్‌సలో రెండో సీడ్‌ కిరణ్‌ జార్జ్‌ 21-19, 8-21, 21-18తో సహచర ఆటగాడు రోనక్‌ చౌహాన్‌పై గెలుపొందాడు. శనివారం జరిగే తుది పోరులో ఇండోనేసియా షట్లర్‌ మహ్మద్‌ యూసుఫ్‌ తో కిరణ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్వినీ భట్‌/శిఖా గౌతమ్‌ ద్వయం, మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో భారత జోడీలు ఎస్‌ కనపురం/ఉదయసూర్యన్‌, సాత్విక్‌ రెడ్డి/రేషిక ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై ఫైనల్స్‌కు ముందే వెనుదిరిగారు.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Updated Date - Dec 14 , 2025 | 02:43 AM