Pro Kabaddi League: యు ముంబా చేతిలో బుల్స్ చిత్తు
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:54 AM
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో యు ముంబా ఘనవిజయం సాధించింది. శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో యు ముంబా 48-28తో బెంగళూరు బుల్స్‌ను చిత్తుచేసింది...
విశాఖపట్నం-స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో యు ముంబా ఘనవిజయం సాధించింది. శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో యు ముంబా 48-28తో బెంగళూరు బుల్స్‌ను చిత్తుచేసింది. ఈ సీజన్‌లో బెంగళూరుకిది వరుసగా మూడో ఓటమి. మ్యాచ్ ప్రారంభం నుంచే యు ముంబా ఆటగాళ్లు రైడింగ్, టాకిలింగ్‌లో వరుస పాయింట్లతో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో ముంబా రైడర్ అజిత్ చౌహాన్ అద్భుతమైన రైడ్‌లో ఒకేసారి ఆరు పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్‌లో ఒక రైడ్‌లో అత్యధిక పాయింట్లు రాబట్టిన రైడర్‌గా అజిత్ రికార్డు నెలకొల్పాడు. అజిత్ మొత్తంగా 13 పాయింట్లు సాధించాడు. ప్రథమార్ధాన్ని 29-12తో ముగించిన ముంబా.. ద్వితీయార్ధంలోనూ జోరు కొనసాగించింది. చివర్లో ముంబాను ఆలౌట్ చేసే అవకాశాలొచ్చినా బుల్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37-32తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..