Tough Break for Tikner: అయ్యో టిక్నర్
ABN , Publish Date - Dec 11 , 2025 | 06:07 AM
పునరాగమనంలో తన తొలి టెస్టులో అద్భుత గణాంకాలతో ఆకట్టుకున్న పేసర్ టిక్నర్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి తీవ్రగాయంతో...
పునరాగమనంలో తన తొలి టెస్టులో అద్భుత గణాంకాలతో ఆకట్టుకున్న పేసర్ టిక్నర్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫీల్డింగ్ చేస్తుండగా బంతి తగిలి తీవ్రగాయంతో టిక్నర్ మైదానాన్ని వీడడం కివీస్ శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. విండీస్ ఇన్నింగ్స్ 66వ ఓవర్లో మైకేల్ రే బౌలింగ్‌లో బ్యాటర్ టెవిన్ ఇమ్లాచ్ ఫైన్ లెగ్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఫీల్డర్ టిక్నర్ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజంపై మొత్తం భారం పడడంతో టిక్నర్ నొప్పితో విలవిల్లా డుతూ మైదానంలోనే కుప్పకూలాడు. దీంతో ఫిజియో వచ్చి టిక్నర్‌ను మైదానం బయటకు తీసుకురాగా, అటునుంచి అటే అతడిని ఆసుపత్రికి తరలించారు. టిక్నర్ ఎడమ భుజం పూర్తిగా విరిగిందని చెబుతున్నారు.
కష్టాల మీద కష్టాలు...: 2023 మార్చి తర్వాత ఇప్పుడే మళ్లీ టెస్టు ఆడుతున్న 32 ఏళ్ల టిక్నర్‌కు కెరీర్‌లో ఒకదాని వెంట ఒకటి కష్టాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. 2023లో తన తొలి టెస్టు ఆడేకంటే ముందు టిక్నర్ తండ్రి ఇల్లు తుఫాన్‌లో కొట్టుకుపోయింది. 2024లో కౌంటీల్లో డెర్బీషైర్ జట్టుకు ఆడుతున్నప్పుడు గర్భవతిగా ఉన్న టిక్నర్ భార్యకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఇప్పుడేమో ఇలా తీవ్రమైన గాయంతో అతను కొన్నాళ్లపాటు క్రికెట్ ఆడలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా.. టిక్నర్ కెరీర్‌లో అన్నీ విషాదఘట్టాలే.
ఇవీ చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ
నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్