Share News

Tim David Powers Australia: టిమ్‌ డేవిడ్‌ ధనాధన్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:46 AM

టిమ్‌ డేవిడ్‌ (52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83) ధనాధన్‌ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 17 పరుగులతో నెగ్గింది. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన...

Tim David Powers Australia: టిమ్‌ డేవిడ్‌ ధనాధన్‌

తొలి టీ20లోఆసీస్‌ గెలుపు

డార్విన్‌ (ఆస్ట్రేలియా) : టిమ్‌ డేవిడ్‌ (52 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83) ధనాధన్‌ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 17 పరుగులతో నెగ్గింది. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. ఎంపాక నాలుగు, రబాడ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 161/9 స్కోరుకే పరిమితమై ఓడింది. రికెల్టన్‌ (71), స్టబ్స్‌ (37) దుకుడైన ఆటతో జట్టును విజయం దిశగా నడిపించినా..15వ ఓవర్లో స్టబ్స్‌ను అవుట్‌ చేసిన హాజెల్‌వుడ్‌ సఫారీలను దెబ్బ కొట్టాడు. డ్వార్షుయిస్‌, హాజెల్‌వుడ్‌ చెరో మూడు వికెట్లు, జంపా రెండు వికెట్లు తీశారు. ఇక..ఆసీ్‌సకిది రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదో టీ20 విజయం కావడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:46 AM