Share News

తిలక్‌ @ 2 ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:01 AM

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఇక మిస్టర్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఏకంగా 25 స్థానాలు ఎగబాకాడు. హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌...

తిలక్‌ @ 2  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌ : టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఇక మిస్టర్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఏకంగా 25 స్థానాలు ఎగబాకాడు. హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌..ఇంగ్లండ్‌తో ప్రస్తుత టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్‌లో (72 నాటౌట్‌) అదరగొట్టాడు. దాంతో బుధవారంనాటి తాజా ర్యాంకింగ్స్‌లో అతడు 832 పాయింట్లతో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ హెడ్‌ (855) కేవలం 23 పాయింట్ల ఆధిక్యంతో టాప్‌లో నిలిచాడు. తిలక్‌ తాజా ఫామ్‌ను బట్టిచూస్తే..రాబోయే ర్యాంకుల్లో అతడు టాప్‌నకు చేరే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే పిన్న వయస్సులో ‘టాపర్‌’గా నిలిచిన రికార్డు కూడా వర్మ (22 ఏళ్లు)కు లభిస్తుంది. ప్రస్తుతం ఈ రికార్డు బాబర్‌ ఆజమ్‌ (23 ఏళ్ల 105 రోజులు) పేరిట ఉంది.


తాజా రేటింగ్‌ పాయింట్లతో తిలక్‌..అత్యధిక పాయింట్లు పొందిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు సూర్యకుమార్‌, విరాట్‌, కేఎల్‌ రాహుల్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మూడో టీ20లో (5/24) ఐదు వికెట్లతో అదరగొట్టిన వరుణ్‌ చక్రవర్తి (666 పాయింట్లు) ఐదో ర్యాంక్‌కు చేరాడు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 03:01 AM