Share News

ధీనిధికి మూడు స్వర్ణాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:59 AM

జాతీయ క్రీడల్లో 14 ఏళ్ల పారిస్‌ ఒలింపిక్‌ స్విమ్మర్‌ ధీనిధి దేశింగు మూడు స్వర్ణాలతో ప్రకంపనలు సృష్టించింది. మరో పారిస్‌ ఒలింపియన్‌ శ్రీహరి నటరాజ్‌ కూడా రెండు పసిడి పతకాలు...

ధీనిధికి మూడు స్వర్ణాలు

హల్ద్‌వాని: జాతీయ క్రీడల్లో 14 ఏళ్ల పారిస్‌ ఒలింపిక్‌ స్విమ్మర్‌ ధీనిధి దేశింగు మూడు స్వర్ణాలతో ప్రకంపనలు సృష్టించింది. మరో పారిస్‌ ఒలింపియన్‌ శ్రీహరి నటరాజ్‌ కూడా రెండు పసిడి పతకాలు సొంతం చేసుకొన్నాడు. కర్ణాటకకు చెందిన ధీనిధి మహిళల 200 మీటర్ల ఫ్రీ స్టయిల్‌ రేస్‌లో 2 నిమిషాల 3.24 సెకన్ల గేమ్స్‌ రికార్డు టైమింగ్‌తో స్వర్ణం నెగ్గింది. 2022లో జాతీయ క్రీడల్లో హషికా రామచంద్ర నెలకొల్పిన (2 నిమిషాల 7.08 సెకన్ల) రికార్డును ధీనిధి బద్దలుకొట్టింది. 100 మీ. బటర్‌ఫ్లై ఈవెంట్‌లో మరో పసిడిని దక్కించుకొన్న దేశింగు.. 4్ఠ100 మీ ఫ్రీ స్టయిల్‌ రిలే జట్టు స్వర్ణం నెగ్గడంలోనూ కీలకపాత్ర పోషించింది. 200 మీ.ఫ్రీ స్టయిల్‌లో శ్రీహరి తొలి స్వర్ణంతో మెరిశాడు. ఆ తర్వాత 4్ఠ100 మీ. ఫ్రీ స్టయిల్‌ రిలేలో అనీష్‌, ఆకాశ్‌మణి, చినాతన్‌తో కలసి శ్రీహరి రెండో పసిడి నెగ్గాడు.


ఇవీ చదవండి:

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

అతడి వల్లే ఓడాం.. ఇది అస్సలు మర్చిపోను: సూర్య

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 02:59 AM