స్పేర్ టైర్ కంటే ఎక్కువగా వాడేస్తున్నారు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:26 AM
చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై మాజీ బ్యాటర్...

న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై మాజీ బ్యాటర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసలు కురిపించాడు. వివిధ స్థానాలకు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం అతడికే చెల్లిందన్నాడు. ‘కేఎల్ రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే ఎక్కువగా వాడేస్తున్నారు. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలంటారు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వస్తే మూడో నెంబర్‌లో ఆడాలంటారు. అంతేకాదు ఒక్కోసారి ఓపెనర్‌గానూ దిగాలని ఆదేశిస్తారు. ఇన్ని స్థానాల్లో ఆడుతూ, నిస్వార్థంగా రాహుల్ జట్టుకు సేవలందిస్తున్నాడు’ అని సిద్ధూ కొనియాడాడు.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి