ఓడిన జట్టు ఇంటికే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:16 AM
చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ‘ఎ’ నుంచి ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. నాలుగు జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ మిగిలి ఉన్నా భారత్, న్యూజిలాండ్ జట్లు నాకౌట్‌కు అర్హత సాధించిన...

చాంపియన్స్ ట్రోఫీలో నేడు
ఇంగ్లండ్ X అఫ్ఘానిస్థాన్
మ.2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ‘ఎ’ నుంచి ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. నాలుగు జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ మిగిలి ఉన్నా భారత్, న్యూజిలాండ్ జట్లు నాకౌట్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్ ‘బి’లో పోరు మాత్రం రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్‌లో భాగంగా మంగళవారం జరగాల్సిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దవడంతో ఈ రెండు జట్లు మూడేసి పాయింట్లతో ఉన్నాయి. దీంతో బుధవారం జరిగే ఇంగ్లండ్-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్ కీలకం కాబోతోంది. ఎందుకంటే ఈ రెండు జట్లూ తమ తొలి మ్యాచ్‌లో ఓటమితో పాయింట్ల ఖాతానే తెరవలేదు. అంటే.. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సెమీస్ అవకాశాలుంటాయి. ఓడిన జట్టు అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. స్టార్లతో కూడిన ఇంగ్లండ్ జట్టు ఆసీ్‌సపై 351 పరుగులు సాధించినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. దీనికి తోడు బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.
అతడి స్థానంలో రెహాన్ అహ్మద్‌ను తీసుకున్నారు. డకెట్, రూట్ ఫామ్‌లో ఉండగా సాల్ట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్, లివింగ్‌స్టోన్ బ్యాట్లు ఝుళిపిస్తే అఫ్ఘాన్ బౌలర్లు హడలిపోవాల్సిందే. అందుకే స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించి ప్రత్యర్థిపై భారీ విజయం సాధించాలనే కసితో ఇంగ్లండ్ ఉంది. అటు హష్మతుల్లా షాహిది సారథ్యంలోని అఫ్ఘాన్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ జట్టు గతేడాది టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియాకు షాకిచ్చి సెమీ్‌స చేరిన విషయం మర్చిపోలేం. రహ్మత్ షా, గుర్బాజ్, ఒమర్జాయ్, జద్రాన్ కీలక బ్యాటర్లు. బౌలింగ్‌లో రషీద్, నబీ, నూర్ అహ్మద్‌లతో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రత్యర్థిపై తమదే పైచేయి కావాలన్న ధ్యేయంతో అఫ్ఘాన్ బరిలోకి దిగుతోంది.
ఇవీ చదవండి:
టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ
భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..
భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి