Share News

Sachin on Siraj: సిరాజ్‌కు తగినంత గుర్తింపు దక్కలేదు

ABN , Publish Date - Aug 08 , 2025 | 03:10 AM

ఇంగ్లండ్‌ టూర్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కొనియాడాడు. అనూహ్య ప్రదర్శనతో అలరించిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. వాస్తవంగా...

Sachin on Siraj: సిరాజ్‌కు తగినంత గుర్తింపు దక్కలేదు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ టూర్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతమని దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కొనియాడాడు. అనూహ్య ప్రదర్శనతో అలరించిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. వాస్తవంగా అతడికి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదన్నాడు. ‘మైదానంలో అతడి వ్యవహారశైలి నాకెంతో నచ్చుతుంది. ఎన్ని ఓవర్లు బౌల్‌ చేసినా అలుపనేదే కనపడదు. ఓ పేసర్‌ ఇంత ఉత్సాహంగా ఉండడం ఏ బ్యాటర్‌కూ నచ్చదు. చివరి రోజు వరకు సిరాజ్‌ అదే జోష్‌ను కొనసాగించాడు. సిరీ్‌సలో వెయ్యి బంతులు వేసినా.. అతడు పేస్‌ తగ్గకుండా గంటకు 145 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేయగలడని కామెంటేటర్లు చెప్పడం విన్నా. అది అతడి పోరాట తత్వానికి నిదర్శనం. ఓవల్‌ టెస్ట్‌ చివరి రోజు సిరాజ్‌ ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే’ అని సచిన్‌ అన్నాడు. సిరాజ్‌ ఇప్పుడు రాణిస్తున్నట్టే ఇంతకుముందూ అద్భుతంగా బౌల్‌ చేస్తూనే ఉన్నాడని, అయితే అతని ప్రతిభకు తగిన గుర్తింపు మాత్రం లభించలేదని సచిన్‌ చెప్పాడు. ఇక ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ కూడా పరిణతి చెందిన ఆటను ప్రదర్శించాడని ప్రశంసించాడు. చివరి టెస్ట్‌లో బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై సెంచరీ చేయడం అసాధారణమన్నాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎంతో ప్రశాంతంగా జట్టును నడిపించాడని సచిన్‌ కొనియాడాడు. భారత జట్టు గొప్ప ప్రదర్శనలో రాహుల్‌ కూడా కీలకపాత్ర పోషించాడని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 08 , 2025 | 03:10 AM