Telugu Titans Hat Trick Win: టైటాన్స్ హ్యాట్రిక్
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:42 AM
ప్రొ కబడ్డీ లీగ్ విశాఖపట్నం అంచెను తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయంతో ముగించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 45-37 స్కోరుతో యు ముంబాను...
ముంబాపై గెలుపుఫ ప్రొ కబడ్డీ
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రొ కబడ్డీ లీగ్ విశాఖపట్నం అంచెను తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయంతో ముగించింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 45-37 స్కోరుతో యు ముంబాను చిత్తుచేసింది. టైటాన్స్ రైడర్లు, డిఫెండర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తొలి భాగంలో టైటాన్స్‌ను ముంబా ఆటగాళ్లు నిలువరించలేకపోయారు. దీంతో ప్రథమార్ధం 27-11తో ముగిసింది. ద్వితీయార్ధంలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు అదే జోరు కొనసాగించి మరోసారి యు ముంబాను ఆలౌట్ చేసి సురక్షితమైన ఆధిక్యాన్ని సాధించారు. టైటాన్స్ ధాటికి ఒత్తిడికి గురైన ముంబా వరుస లైనౌట్‌లతో పాయింట్లు సమర్పించుకుంది. చివరి నిమిషాలలో అనూహ్యంగా పుంజుకున్న ముంబా ఆటగాళ్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేసినా ఫలితం లేకపోయింది. టైటాన్స్‌లో రైడర్ భరత్ 13 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, యు ముంబాలో సందీప్‌కుమార్, అమి మహ్మద్ జఫర్ దనేష్ చెరో ఏడు పాయింట్లు రాబట్టారు. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టన్ 43-32తో యూపీ యోధాస్‌ను ఓడించింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి