Pro Kabaddi League: పోరాడి ఓడిన టైటాన్స్
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:07 AM
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ కథ ముగిసింది. బుధవారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫయర్-2లో టైటాన్స్ 45-50తో పుణెరి పల్టన్ చేతిలో పరాజయం పాలైంది....
క్వాలిఫయర్-2లో
పుణెరి పల్టన్ విజయం
ఫైనల్లో దబాంగ్
ఢిల్లీతో అమీతుమీ
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ కథ ముగిసింది. బుధవారం హోరాహోరీగా జరిగిన క్వాలిఫయర్-2లో టైటాన్స్ 45-50తో పుణెరి పల్టన్ చేతిలో పరాజయం పాలైంది. చివరి 3 నిమిషాల్లో స్టార్ రైడర్ ఆదిత్య షిండే ఐదు పాయింట్ల సూపర్ రైడ్‌తో మ్యాచ్‌ను పల్టన్‌వైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన పుణెరి పల్టన్ శుక్రవారం జరిగే టైటిల్ పోరులో దబాంగ్ ఢిల్లీతో తాడోపేడో తేల్చుకోనుంది. టైటాన్స్ ప్లేయర్ భరత్ 23 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేక పోయాడు. ఫస్టాఫ్ చివరికి టైటాన్స్ 24-20తో పైచేయిగా నిలిచింది.
Also Read:
రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్