Share News

National Senior Badminton Championship: టాప్‌సీడ్‌కు చరిష్మా షాక్‌

ABN , Publish Date - Dec 27 , 2025 | 02:45 AM

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి సూర్య చరిష్మా తమిరి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఉన్నతి హుడాకు షాకిచ్చి...

National Senior Badminton Championship: టాప్‌సీడ్‌కు చరిష్మా షాక్‌

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌

  • తెలుగమ్మాయి సంచలనం

  • సెమీ్‌సకు తరుణ్‌

విజయవాడ సిటీ (ఆంధ్రజ్యోతి): జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి సూర్య చరిష్మా తమిరి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఉన్నతి హుడాకు షాకిచ్చి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అన్‌సీడెడ్‌ సూర్య చరిష్మా 21-12, 21-15తో ఉన్నతిని చిత్తుచేసింది. మరో క్వార్టర్స్‌లో మహారాష్ట్రకు చెందిన శ్రుతి మందాడ 22-20, 21-12తో రెండోసీడ్‌ అనుపమకు ఝలకిచ్చింది. రక్షితశ్రీ రామరాజు 16-21, 21-14, 21-18తో తన్వీ శర్మను ఓడించి చరిష్మాతో సెమీస్‌ ఫైట్‌కు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్‌ తరుణ్‌ మన్నెపల్లి 21-13, 22-20తో మన్‌రాజ్‌పై, భరత్‌ భార్గవ్‌ 21-17, 21-13తో గిన్‌పాల్‌పై, టాప్‌సీడ్‌ కిరణ్‌ జార్జ్‌ 21-18, 21-18తో రోనక్‌పై, రిత్విక్‌ 21-13, 22-20తో సతీశ్‌పై నెగ్గి సెమీ్‌సలో అడుగుపెట్టారు. మహిళల డబుల్స్‌లో రిదువర్షిణి/సానియా జోడీ 21-16, 21-19తో టాప్‌సీడ్‌ రీతూపర్ణ పాండా/శ్వేతపర్ణ పాండా జంటను చిత్తుచేసి సెమీ్‌సలో అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?

Vignesh Puthur Creates History: 32 ఏళ్ల రికార్డ్ బద్దలు.. చరిత్ర సృష్టించిన విజ్ఞేష్

Updated Date - Dec 27 , 2025 | 02:45 AM