Share News

FIDE World Cup Chess: అర్జున్‌ హరి గేమ్‌లు డ్రా

ABN , Publish Date - Nov 12 , 2025 | 05:17 AM

తెలుగు గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్‌, పెం టేల హరికృష్ణ, కార్తీక్‌ వెంకటరామన్‌ ఫిడే వరల్డ్‌కప్‌ నాలుగో రౌండ్‌ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నారు. వీరితో పాటు ప్రజ్ఞానంద కూడా ఓటమి అంచుల్లో నిలిచిన...

FIDE World Cup Chess: అర్జున్‌ హరి గేమ్‌లు డ్రా

పనాజీ: తెలుగు గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్‌, పెం టేల హరికృష్ణ, కార్తీక్‌ వెంకటరామన్‌ ఫిడే వరల్డ్‌కప్‌ నాలుగో రౌండ్‌ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నారు. వీరితో పాటు ప్రజ్ఞానంద కూడా ఓటమి అంచుల్లో నిలిచిన గేమ్‌ను కష్టపడి డ్రాగా ముగించాడు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌ తొలి గేమ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన రెండో సీడ్‌ అర్జున్‌ 20 ఎత్తులకే హంగేరి జీఎం పీటర్‌ లీకోతో తన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. స్వీడెన్‌ జీఎం గ్రాండిలియ్‌సతో తలపడిన హరికృష్ణ 32వ ఎత్తు వద్ద డ్రా చేసుకోగా, వియత్నాం జీఎం లి క్వాంగ్‌ లైమ్‌తో ఆడిన కార్తీక్‌ 36వ ఎత్తు దగ్గర డ్రాకు అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి:

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

Updated Date - Nov 12 , 2025 | 05:17 AM