నందినికి స్వర్ణం
ABN , Publish Date - Feb 12 , 2025 | 02:56 AM
జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ఒకే రోజు నాలుగు పతకాలు కొల్లగొట్టారు. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో హెప్టాథ్లాన్‌లో అగసర నందిని...
నిత్య, నిషికకు కాంస్యాలు
నెట్‌బాల్ మహిళల జట్టుకు రజతం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ఒకే రోజు నాలుగు పతకాలు కొల్లగొట్టారు. డెహ్రాడూన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో హెప్టాథ్లాన్‌లో అగసర నందిని 5,601 పాయింట్లతో పసిడి పతకాన్ని ముద్దాడింది. 200 మీటర్ల పరుగులో జి.నిత్య (హైదరాబాద్) 23.76 సెకన్లలో రేసును ముగించి కాంస్యం అందుకుంది. విశాఖ ఎక్స్‌ప్రెస్ యర్రా జ్యోతి 23.35 సెకన్లలో స్వర్ణం గెల్చుకుంది. ఇక ఆర్టిస్టిక్ ఆల్‌రౌండ్ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణ జిమ్నాస్ట్ నిషిక అగర్వాల్ 44.767 పాయింట్ల కాంస్యం పతకం సాధించింది. మహిళల నెట్‌బాల్ ఫాస్ట్ 5లో తెలంగాణ రజతం అందుకుంది.

తదుపరి క్రీడలకు మేఘాలయ ఆతిథ్యం
న్యూఢిల్లీ: 39వ జాతీయ క్రీడలకు మేఘాలయ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష.. ఆ రాష్ట్ర సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. 2027 ఫిబ్రవరి/మార్చిలో క్రీడలు జరిగే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల ముగింపోత్సవంలో ఐవోఏ జెండాను మేఘాలయకు అందించనున్నారు.
ఇవీ చదవండి:
రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్
కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి
సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి