టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభం
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:20 AM
ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్ట్‌ల సుదీర్ఘ సిరీ్‌సకు భారత జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. శనివారం ఇక్కడకు చేరుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా...
లండన్: ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్ట్‌ల సుదీర్ఘ సిరీ్‌సకు భారత జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. శనివారం ఇక్కడకు చేరుకున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా మరుసటి రోజే సాధన మొదలు పెట్టింది. పేసర్లు బుమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కెప్టెన్ గిల్, వైస్-కెప్టెన్ పంత్, ఆల్‌రౌండర్ జడేజా ఆదివారం ప్రాక్టీస్ చేశారు. కోచ్ గంభీర్ సాధన ఆసాంతం పర్యవేక్షించాడు. భారత టెస్ట్ జట్టులోని ఇతర సభ్యులు..ఇండియా ‘ఎ’ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరీ్‌సలో భాగంగా ఇంగ్లండ్ లయన్స్‌తో ‘ఎ’ జట్టు రెండో అనధికార టెస్ట్‌లో తలపడుతోంది. ఇక..భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ ఈనెల 20న హెడింగ్లీలో ప్రారంభం కానుంది.
టెస్ట్ సిరీస్ టిక్కెట్లు..
హాట్ కేకులు
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఐదు టె స్ట్‌లకు టిక్కెట్లు దాదాపు అ మ్ముడయ్యాయట. హెడింగ్లీలో జరిగే తొలి టెస్ట్, ఎడ్జ్‌బాస్టన్ ఆతిథ్యమిచ్చే రెండో టెస్ట్ నా లుగో రోజు ఆటకు సంబంధించిన టిక్కెట్లు మాత్రమే...అదీ కొద్ది సంఖ్యలో అందుబాటులో ఉన్నాయట.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి