Share News

క్లీన్‌స్వీ్‌ప లక్ష్యంగా..

ABN , Publish Date - Feb 12 , 2025 | 03:00 AM

వరుసగా రెండు వన్డేల్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. దీంట్లో భాగంగా బుధవారమిక్కడి నరేంద్ర మోదీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో...

క్లీన్‌స్వీ్‌ప లక్ష్యంగా..

మ.1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

  • జోష్‌లో టీమిండియా

  • కోహ్లీ ఫామ్‌పై దృష్టి

  • ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డే నేడు

అహ్మదాబాద్‌: వరుసగా రెండు వన్డేల్లో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. దీంట్లో భాగంగా బుధవారమిక్కడి నరేంద్ర మోదీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే ఆఖరిదైన మూడో వన్డేలో తలపడనుంది. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. తద్వారా ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో సగర్వంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అటు వరుసగా టీ20, వన్డేల్లో సిరీ్‌సలను కోల్పోయిన బట్లర్‌ సేనకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మెకల్లమ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. బజ్‌బాల్‌ గేమ్‌ను అలవాటు చేసుకున్న ఈ టీమ్‌ భారత్‌లో తమ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చడం లేదు. కనీసం నేటి మ్యాచ్‌లోనైనా గెలిచి ఓదార్పు విజయంతో సీటీలో అడుగుపెట్టాలనుకుంటోంది. ఏదేమైనా సీటీ ముందు ఇరు జట్లకు ఇదే ఆఖరి సన్నాహకం కావడంతో ఎలాంటి అలక్ష్యం లేకుండా పోరాడాలనుకుంటున్నాయి. ఇక లక్షకు పైగా సామర్థ్యం కలిగిన స్థానిక స్టేడియంలో భారత జట్టు చివరిసారి వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆడి ఓడింది.


బౌలింగ్‌ బలహీనంగా..

రెండో వన్డేలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు విశేషంగా రాణించారు. టాప్‌-6 ఆటగాళ్ల జోరుతో స్కోరు 300 దాటగలిగింది. కానీ భారీస్కోరును కాపాడుకునే క్రమంలో బౌలర్లు ప్రభా వం చూపలేకపోయారు. భారత్‌ అలవోకగా లక్ష్యాన్ని పూర్తి చేయగలిగింది. కటక్‌లో ఛేజింగ్‌ జట్టుకు విజయావకాశాలు ఉంటాయని తెలిసి కూడా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టింది. అలాగే పేసర్‌ ఆర్చర్‌కు విశ్రాంతినివ్వడమూ దెబ్బతీసింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌తో పాటు బ్రెండన్‌ కార్స్‌ను ఆడించే అవకాశం ఉంది. స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ మాత్రం నిలకడగా రాణించగలుగుతున్నాడు.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, విరాట్‌, శ్రేయాస్‌, రాహుల్‌/పంత్‌, హార్దిక్‌, జడేజా/సుందర్‌, అక్షర్‌, వరుణ్‌, రాణా/అర్ష్‌దీప్‌, షమి.

ఇంగ్లండ్‌: డకెట్‌, సాల్ట్‌, బాంటన్‌, రూట్‌, బ్రూక్‌, బట్లర్‌ (కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, కార్స్‌, ఆర్చర్‌, రషీద్‌, ఉడ్‌.


పిచ్‌

ఈ వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. బౌండరీ విస్తీర్ణం కూడా పెద్దది. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు కేవలం 237 మాత్రమే. అలాగే స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంటుంది. మంచు ప్రభావం ఎక్కువే. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.

మార్పులుంటాయా?

సిరీ్‌సను ఇప్పటికే 2-0తో వశం చేసుకున్న భారత్‌ నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌ కోసం ఎలాంటి కూర్పుతో దిగనుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. చాంపియన్స్‌ ట్రోఫీ ముందు రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ లభిస్తే బావుంటుందన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌, పేసర్‌ అర్ష్‌దీప్‌, స్పిన్నర్‌ సుందర్‌లను ఆడిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. అయితే పంత్‌ జట్టులోకి రావాలంటే రాహుల్‌ను తప్పించాలి. అతనిప్పటికే ఆరో నెంబర్‌లో ఆడి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక అర్ష్‌దీప్‌, సుందర్‌లను కూడా ఆడించేందుకు కోచ్‌ గంభీర్‌ సిద్ధంగా ఉన్నాడా? లేడా? అనే విషయంలో స్పష్టత లేదు. ఇక స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌ ఒక్కటే జట్టును ఆందోళనపరుస్తోంది. గాయంతో తొలి వన్డేకు దూరమైన అతను రెండో మ్యాచ్‌లో ఐదు రన్స్‌కే పరిమితమయ్యాడు. అంతకుముందు ఆసీస్‌ టూర్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో నేటి మ్యాచ్‌ అతడికి అగ్నిపరీక్ష కానుంది. కెప్టెన్‌ రోహిత్‌ సూపర్‌ సెంచరీ టీమిండియాలో జోష్‌ను నింపింది. విరాట్‌ సైతం పరుగుల బాట పడితే చాంపియన్స్‌ ట్రోఫీ ముందు జట్టుకు తిరుగులేని ఆత్మవిశ్వాసం లభించినట్టవుతుంది. బౌలింగ్‌లో పేసర్లు హర్షిత్‌, షమిలతో పాటు స్పిన్నర్లు జడేజా, అక్షర్‌, వరుణ్‌ సమష్ఠిగా రాణిస్తున్నారు.


ఇవీ చదవండి:

రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్

కివీస్ లెజెండ్ ఊచకోత.. 49 బంతుల్లో 160 రన్స్.. ఇదేం బాదుడు సామి

సచిన్ క్రేజీ రికార్డుపై కన్నేసిన రోహిత్.. చరిత్రకు అడుగు దూరం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2025 | 03:01 AM