World Junior Badminton Championship: ప్రీక్వార్టర్స్‌లో తన్వీ ఉన్నతి
ABN , Publish Date - Oct 16 , 2025 | 04:28 AM
భారత షట్లర్లు తన్వీ శర్మ, ఉన్నతి హుడా, రక్షిత ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప రౌండ్-16లో అడుగు పెట్టారు. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌లో...
గువాహటి: భారత షట్లర్లు తన్వీ శర్మ, ఉన్నతి హుడా, రక్షిత ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప రౌండ్-16లో అడుగు పెట్టారు. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌లో టాప్ సీడ్ తన్వీ 15-12, 15-7తో ఓయీ వినార్తో (ఇండోనేసియా)పై, ఉన్నతి 15-8, 15-5తో అలైస్ వాంగ్ (అమెరికా)పై, రక్షిత 11-15, 15-5, 15-8తో అలియా (సింగపూర్)పై నెగ్గారు. బాలుర సింగిల్స్‌లో జ్ఞాన దత్తా 11-15, 15-6, 15-11తో సూర్యాక్ష్ రావత్‌ని ఓడించాడు. డబుల్స్‌లో భార్గవ రామ్/విశ్వతేజ్ జంట ప్రీక్వార్టర్స్‌కు చేరింది.
సాత్విక్ జోడీ బోణీ: డెన్మార్క్ ఓపెన్‌లో లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. సింగిల్స్‌లో లక్ష్య 10-21, 21-8, 21-18తో నాట్ గుయెన్ (ఐర్లాండ్)పై, డబుల్స్‌లో సాత్విక్ ద్వయం 17-21, 21-11, 21-17తో స్కాట్లాండ్ జోడీ క్రిస్టోఫర్/మాథ్యూపై నెగ్గారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telugu News