Guwahati Masters Super 100: క్వార్టర్స్‌లో తన్వీ అస్మిత
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:25 AM
భారత షట్లర్లు తన్వీ శర్మ, అస్మిత చలిహ గువాహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో...
గువాహటి: భారత షట్లర్లు తన్వీ శర్మ, అస్మిత చలిహ గువాహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్, 8వ సీడ్ క్రీడాకారిణి తన్వీ 21-17, 23-21 తేడాతో ఫన్నచెట్ (ఽథాయ్‌లాండ్)ను వరుస గేముల్లో ఓడించింది. అలాగే 96వ ర్యాంకర్ అస్మిత 16-21, 21-17, 21-16 తేడాతో తనకన్నా మెరుగైన ప్లేయర్, భారత్‌కే చెందిన ఐదో సీడ్ అన్మోల్ ఖర్బ్ (49వ ర్యాంక్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో నెగ్గిన ఇష్రానీ బారువా కూడా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News