Syed Mushtaq Ali Trophy: బిహార్‌పై హైదరాబాద్ గెలుపు
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:16 AM
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (67 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ మరో విజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’...
జాదవ్‌పూర్: ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (67 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ మరో విజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఏడు వికెట్లతో బిహార్‌ను చిత్తు చేసింది. మొదట బిహార్ 20 ఓవర్లలో 132/8 స్కోరుకే పరిమితమైంది. వైభవ్ సూర్యవంశీ (11) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. పియూష్ (34), బిపిన్ (31 నాటౌట్) ఆదుకున్నారు. తనయ్ త్యాగరాజన్ 3, మిలింద్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనను 12.5 ఓవర్లలో 134/3 స్కోరుతో హైదరాబాద్ సునాయాసంగా పూర్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్