రాణించిన సూర్య, రహానె
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:22 AM
సూర్యకుమార్ యాదవ్ (70), కెప్టెన్ అజింక్యా రహానె (88 బ్యాటింగ్) రాణించడంతో హరియాణాతో మ్యాచ్‌లో ఆటకు మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 278/4 స్కోరు చేసింది...
రంజీ క్వార్టర్స్
కోల్‌కతా: సూర్యకుమార్ యాదవ్ (70), కెప్టెన్ అజింక్యా రహానె (88 బ్యాటింగ్) రాణించడంతో హరియాణాతో మ్యాచ్‌లో ఆటకు మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 278/4 స్కోరు చేసింది. మొత్తంగా ముంబై 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శార్దూల్ ఠాకూర్ (6/58) దెబ్బకు ఓవర్‌నైట్ స్కోరు 263/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హరియాణా 301 పరుగులకు ఆలౌటైంది. ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరు 315కు 14 రన్స్ వెనుకబడింది.
ఉర్విల్, జైమీత్ శతకాలు.. గుజరాత్ 511 ఆలౌట్
ఉర్విల్ పటేల్ (140), జైమీత్ పటేల్ (103) శతకాల మోత మోగించడంతో.. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో గుజరాత్ పట్టుబిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 260/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 511 పరుగుల భారీ స్కోరు చేసింది. ఽఅనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సౌరాష్ట్ర మూడో రోజు ఆట ఆఖరుకు వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 216 రన్స్ సాధించింది.
పట్టుబిగించిన విదర్భ: విదర్భతో మ్యాచ్‌లో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విదర్భ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 169/5 స్కోరు చేసింది. మొత్తంగా 297 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 353 పరుగులు చేసింది.
ఇవీ చదవండి:
డెబ్యూ మ్యాచ్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ఇతడితో టీమిండియాకు డేంజరే
ఒక్కడికే ఆ రూల్ ఎందుకు.. కేఎల్ రాహుల్‌పై పగబట్టారా..
ఒక్క సెంచరీతో 5 క్రేజీ రికార్డులు.. ఇది హిట్‌మ్యాన్ తాండవం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి