Supreme Court: సుశీల్ బెయిల్ రద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 01:50 AM
జాతీయ జూనియర్ రెజ్లింగ్ మాజీ చాంపియన్ సాగర్ ధన్కడ్ హత్య కేసులో..ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈమేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో...
వారం రోజుల్లో లొంగిపోవాలి..
సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : జాతీయ జూనియర్ రెజ్లింగ్ మాజీ చాంపియన్ సాగర్ ధన్కడ్ హత్య కేసులో..ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈమేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్‌కు బెయిల్ ఇస్తూ మార్చి నాలుగున ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది. సుశీల్ కుమార్ వారం రోజుల్లో లొంగిపోవాలని సూచించింది. సాగర్ ధన్కడ్ హత్య కేసులో సుశీల్‌తోపాటు మరో 17 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఏమిటీ కేసు?
ఆస్తి వివాదం నేపథ్యంలో..మే, 2021న న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధన్కడ్, అతడి స్నేహితులు ఇద్దరిపై సుశీల్ కుమార్ తదితరులు దాడి చేసినట్టు కేసు నమోదైంది. తీవ్ర గాయాలతో సాగర్ మరణించినట్టు పోస్ట్‌మార్టంలో తేలింది. దాంతో అదే నెలలో పోలీసులు సుశీల్‌ను అరెస్ట్ చేశారు. సాగర్ హత్య కేసులో సుశీల్ కీలక పాత్ర పోషించినట్టు 2022 అక్టోబరులో ఢిల్లీ ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా..మూడున్నర సంవత్సరాలు జైలులో ఉన్న సుశీల్ గత మార్చిలో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి వాదనలు విన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుశీల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సాగర్ తండ్రి అశోక్ ధన్కడ్ సుప్రీంకోర్టులో సవాలు చేశాడు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి