Share News

స్టొయినిస్‌ షాకింగ్‌ నిర్ణయం!

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:56 AM

గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ (35) హఠాత్తుగా...

స్టొయినిస్‌ షాకింగ్‌ నిర్ణయం!

వన్డేలకు తక్షణం వీడ్కోలు

మెల్‌బోర్న్‌: గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియాకు చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ (35) హఠాత్తుగా వన్డేలకు వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు. తక్షణం తాను 50 ఓవర్ల ఫార్మాట్‌ నుంచి తప్పుకొంటున్నట్టు అతడు ప్రకటించడంతో ఈ నెల 19 నుంచి జరిగే సీటీకి కూడా దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు కమిన్స్‌, మిచెల్‌ మార్ష్‌, హాజెల్‌వుడ్‌ గాయాల బారిన పడడంతో ఐసీసీ మెగా టోర్నీ కోసం తగిన జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు స్టొయినిస్‌ రిటైర్మెంట్‌ ప్రకటనతో అతడి స్థానంలో మరో ఆటగాడిని వెతకాల్సిన పరిస్థితి. కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్నప్పుడు తొడ కండర గాయం కావడంతోనే మార్కస్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. అయితే, టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతానని అతడు చెప్పాడు. 2021 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన జట్లలో మార్కస్‌ సభ్యుడు. ఆడిన 71 వన్డేల్లో 26.69 సగటుతో 1495 పరుగులు చేసిన స్టొయినిస్‌.. బంతితో 48 వికెట్లు పడగొట్టాడు. 74 టీ20ల్లో 1245 పరుగులు సాధించగా.. 45 వికెట్లు కూల్చాడు. కానీ, తన పదేళ్ల కెరీర్‌లో ఒక్క టెస్ట్‌ కూడా ఆడలేదు.


కమిన్స్‌, హాజెల్‌వుడ్‌ అవుట్‌

కెప్టెన్‌ కమిన్స్‌తో పాటు పేసర్‌ హాజెల్‌వుడ్‌ గాయం కారణంగా చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యారు. కమిన్స్‌ కెప్టెన్సీలోనే ఆసీస్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మిచెల్‌ మార్ష్‌ కూడా గాయంతో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. సీటీ కోసం జనవరి 13న ఆసీస్‌ ప్రకటించిన ప్రాథమిక జట్టులో ఈ నలుగురు ఉండడం గమనార్హం. అయితే ఈనెల 12 వరకు టీమ్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉండడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కొత్తగా మరో నలుగురితో వీరి స్థానాలను భర్తీ చేయనుంది.


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 12:56 AM