Vijay Hazare Trophy: ‘హజారే’లో స్టార్ల సందడి
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:13 AM
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు భారత ఆటగాళ్లు పలువురు బరిలోకి దిగనుండడంతో విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త సందడి నెలకొంది. బుధవారం నుంచి టోర్నీ...
బరిలో కోహ్లీ, రోహిత్, గిల్, పంత్
నేడు ఢిల్లీగీఆంధ్ర; హైదరాబాద్ గీయూపీ
బెంగళూరు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు భారత ఆటగాళ్లు పలువురు బరిలోకి దిగనుండడంతో విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త సందడి నెలకొంది. బుధవారం నుంచి టోర్నీ జరగనుంది. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కూడా తమతమ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నా.. అభిమానుల దృష్టి మాత్రం కోహ్లీ, రోహిత్‌పైనే ఉంది. బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత విరాట్ ఈ దేశవాళీ టోర్నీలో ఆడుతున్నాడు. ముంబై తరఫున రోహిత్ కేవలం రెండు మ్యాచ్‌లు అంటే.. ఈ నెల 24న సిక్కింతో, 26న ఉత్తరాఖండ్‌తో ఆడనున్నాడు. కోహ్లీ.. ఢిల్లీ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే దానిపై స్పష్టత లేదు. గ్రూప్-డిలో తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో ఢిల్లీ తలపడనుంది. ఇక, గ్రూప్-బిలో రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తో హైదరాబాద్ ఆడనుంది.
లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 16 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ (15999) ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో భారత ప్లేయర్లలో సచిన్ (21,999) టాప్‌లో ఉన్నాడు.
ఇవీ చదవండి:
టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లో దీప్తి శర్మ!
టీ20ల్లో నయా రికార్డు.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు