Asia Cup 2025: లంక ఆల్‌రౌండ్ షో
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:54 AM
ఆసియాక్‌పలో శ్రీలంక జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో కనబర్చింది. తద్వారా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ గ్రూప్ బి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు..
ఆసియాకప్‌లో బంగ్లాపై ఘన విజయం
అబుధాబి: ఆసియాక్‌పలో శ్రీలంక జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో కనబర్చింది. తద్వారా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ గ్రూప్ బి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 139/5 స్కోరుకే పరిమితమైంది. మొదటి రెండు ఓవర్లలోనే జట్టు ఖాతా కూడా తెరువకుండా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో షమీమ్ (42 నాటౌట్), జకెర్ అలీ (41 నాటౌట్) మెరుపు ఆటతో ఆరో వికెట్‌కు అజేయంగా 86 పరుగులు జోడించారు. హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ నిస్సాంక (50) అర్ధసెంచరీతో రాణించాడు. కమిల్ మిషారా (46 నాటౌట్) అజేయంగా నిలిచాడు. మెహెదీ హసన్ రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కమిల్ మిషారాకు లభించింది.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి