South Africa Triumphs Victory On Pakistan: దక్షిణాఫ్రికా ఘనవిజయం
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:15 AM
పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. గురువారం ముగిసిన ఆఖరి, రెండో టెస్టులో స్పిన్నర్ సిమోన్ హార్మర్ ఆరు వికెట్లతో పాక్‌ను దెబ్బతీశాడు..
పాక్‌తో సిరీస్ 1-1తో సమం
స్పిన్నర్ హార్మర్‌కు ఆరు వికెట్లు
రావల్పిండి: పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. గురువారం ముగిసిన ఆఖరి, రెండో టెస్టులో స్పిన్నర్ సిమోన్ హార్మర్ ఆరు వికెట్లతో పాక్‌ను దెబ్బతీశాడు. దీంతో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగో రోజు హార్మర్ ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 138 రన్స్‌కే పరిమితమైంది. బాబర్ ఆజమ్ (50), సల్మాన్ (28) రాణించారు. అనంతరం 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 12.3 ఓవర్లలో 73/2 స్కోరుతో గెలిచారు. మార్‌క్రమ్ (42) వేగంగా ఆడాడు.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ