Smriti Mandhana Practice: దటీజ్ మంధాన
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:53 AM
ప్రతి మనిషి జీవితంలో వివాహం ఓ అపురూప ఘట్టం. అలాంటి పెళ్లి వేడుక రద్దయితే తట్టుకోవడం ఎంతో కష్టం. కానీ టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన..
స్టార్ బ్యాటర్ నెట్ ప్రాక్టీస్
శ్రీలంకతో సిరీ్‌సకు సన్నాహకం
ముంబై: ప్రతి మనిషి జీవితంలో వివాహం ఓ అపురూప ఘట్టం. అలాంటి పెళ్లి వేడుక రద్దయితే తట్టుకోవడం ఎంతో కష్టం. కానీ టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన..పలాష్ ముచ్చల్‌తో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించిన 24 గంటల్లోపే క్రికెట్ మైదానంలో అడుగు పెట్టింది. ఈనెల 21నుంచి శ్రీలంకతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు సన్నాహకాలు ఆరంభించింది. ఇందులో భాగంగా సోమవారం స్వస్థలంలో నెట్ ప్రాక్టీస్ చేసింది. ఈమేరకు ఆమె సాధన చేస్తున్న ఫొటోను స్మృతి సోదరుడు శ్రవణ్ మంధాన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దానికి హార్ట్ ఎమోజీని జత చేశాడు. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఫొటోకు పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు వచ్చాయి. స్మృతి గుండె నిబ్బరాన్ని కొనియాడడంతోపాటు ఆమె అంకితభావానికి సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్ జేజేలు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!