Kirmani Autobiography Stumped: కిర్మాణీ నాకు స్ఫూర్తి
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:57 AM
దిగ్గజ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ హీరో సయ్యద్ కిర్మాణీ తనలాంటి ఎందరో క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారని మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కిర్మాణీ ఆత్మకధ ‘స్టంప్డ్’ పుస్తక ఆవిష్కరణకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దిగ్గజ క్రికెటర్, 1983 వరల్డ్‌కప్ హీరో సయ్యద్ కిర్మాణీ తనలాంటి ఎందరో క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచారని మహ్మద్ సిరాజ్ అన్నాడు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కిర్మాణీ ఆత్మకధ ‘స్టంప్డ్’ పుస్తక ఆవిష్కరణకు సిరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ టీమిండియా 1983 వన్డే ప్రపంచకప్ గెలిచేనాటికి తాను పుట్టలేదని, కానీ తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పటి నుంచి ఆయన గురించి గొప్పగా విని స్ఫూర్తి పొందానని చెప్పాడు. 1983 వరల్డ్‌కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్‌నాథ్ మాట్లాడుతూ కిర్మాణీతో కలిసి తాను పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ ఆడానని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. మహ్మద్ అజరుద్దీన్ మాట్లాడుతూ తాను చూసిన అత్యుత్తమ వికెట్‌కీపర్ కిర్మాణీనేనని చెప్పాడు. కాగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు, ఆయన టీవీ చూడడం ప్రారంభించేసరికి క్రికెటర్లలో కపిల్‌దేవ్, తాను తప్ప మరెవరూ తెలియదని, మీరు మాకు అంత పెద్ద ఐకానిక్ ప్లేయర్ అని చెప్పేసరికి సంతోషం పట్టలేకపోయానని కిర్మాణీ చెప్పాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, మాజీ క్రికెటర్లు శివ్‌లాల్ యాదవ్, చాముండేశ్వర్ నాథ్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
For More Telangana News And Telugu News