Asia Team Badminton Championship: బరిలో సింధు లక్ష్యసేన్
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:52 AM
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తలపడే భారత జట్లను గురువారం ప్రకటించారు. పీవీ సింధు, లక్ష్యసేన్ మహిళలు, పురుషుల సింగిల్స్‌లో...
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప
న్యూఢిల్లీ: ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో తలపడే భారత జట్లను గురువారం ప్రకటించారు. పీవీ సింధు, లక్ష్యసేన్ మహిళలు, పురుషుల సింగిల్స్‌లో, మేటి ద్వయం సాత్విక్/చిరాగ్ డబుల్స్‌లో కీలక భూమిక పోషించనున్నారు. వచ్చే ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు చైనాలోని క్వింగ్‌డావోలో చాంపియన్‌షి్‌ప జరగనుంది. మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ కావడం విశేషం.
మహిళల జట్టు: సింధు, ఉన్నతి హుడా, తన్వీశర్మ, రక్షిత, మాళవిక, ట్రీసా, గాయత్రీ గోపీచంద్, ప్రియా కొంజెంగ్‌బామ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో; పురుషుల జట్టు: లక్ష్యసేన్, ఆయుష్ షెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్, సాత్విక్, చిరాగ్, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్.
ఇవీ చదవండి:
సహచరుడికి ఇచ్చిన మాట..15 ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్న సచిన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. నెం.2గా కోహ్లీ