Shubham Gill Run Out Controversy: గిల్ అవుటా నాటౌటా
ABN , Publish Date - May 03 , 2025 | 04:03 AM
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్‌పై వివాదం చోటు చేసుకుంది. తుది నిర్ణయంగా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించగా గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్ వివాదాస్పదంగా మారింది. 13వ ఓవర్‌లో బట్లర్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడి సింగిల్‌కు వెళ్లాడు. అయితే గిల్ నాన్‌స్ట్రయిక్ ఎండ్ నుంచి క్రీజులోకి వచ్చే లోపే హర్షల్ త్రోతో కీపర్ క్లాసెన్ వికెట్లను గిరాటేశాడు. కానీ రీప్లేలో మాత్రం వికెట్లను బంతితో కాకుండా గ్లౌవ్స్‌తో పడగొట్టినట్టు అనిపించింది. చాలా సార్లు పరిశీలించాక చివరికి థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో అసంతృప్తిగా మైదానం వీడిన గిల్ డకౌట్ దగ్గర ‘సరిగ్గా చూడడం రాదా’ అన్నట్టుగా తన కళ్లను చూపెడుతూ టీవీ అంపైర్‌తో వాదనకు దిగడం కనిపించింది.