India Cricket Rankings: రోహిత్‌కు రెండో ర్యాంక్
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:58 AM
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకుల జాబితాలోని బ్యాటింగ్ విభాగంలో గిల్ 784 పాయింట్లతో...
టాప్‌లోనే గిల్, అభిషేక్
ఐసీసీ ర్యాంకింగ్స్
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకుల జాబితాలోని బ్యాటింగ్ విభాగంలో గిల్ 784 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే, పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను వెనక్కునెట్టిన రోహిత్ రెండో ర్యాంక్‌కు చేరుకోగా.. కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ర్యాంక్‌లు విడుదల చేసినప్పుడు రోహిత్, కోహ్లీ పేర్లు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. వీరిద్దరూ వన్డేలకు కూడా వీడ్కోలు పలికారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఐసీసీ వీటికి ఫుల్‌స్టాప్ పెట్టింది. సాంకేతిక కారణాలతోనే వీరి ర్యాంక్‌లు కొంతసేపు కనిపించలేదని వివరణ ఇచ్చింది. బౌలర్ల విభాగంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్‌కు పడిపోగా.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ టాప్‌నకు చేరుకొన్నాడు. టీ20ల్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ టాప్-2లో కొనసాగుతున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ 6వ, జైస్వాల్ 10వ స్థానాల్లో నిలిచారు.
ఇవి కూడా చదవండి..
Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం
India Women Cricket: ప్రపంచకప్ జట్టులో శ్రీచరణి
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..