Akash Chopra T20 World Cup Team: చోప్రా జట్టులో కూడా గిల్‌కు చోటు లేదు
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:09 AM
ప్రముఖ విశ్లేషకుడు, టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా తన టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించాడు. బీసీసీఐ సెలెక్టర్లు వదిలేసిన వారితోపాటు జాతీయ జట్టులోకి...
న్యూఢిల్లీ: ప్రముఖ విశ్లేషకుడు, టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా తన టీ20 వరల్డ్‌కప్ జట్టును ప్రకటించాడు. బీసీసీఐ సెలెక్టర్లు వదిలేసిన వారితోపాటు జాతీయ జట్టులోకి వచ్చే పరిస్థితులు కూడా లేని ఆటగాళ్లను కూడా తన టీమ్‌లో చేర్చడం ఆశ్చర్యకరం. అయితే, టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్‌మన్ గిల్‌కు తన డ్రీమ్ టీమ్‌లో స్థానం కల్పించలేదు. ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న దీపక్ చాహర్, క్రునాల్ పాండ్యా, యజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్‌కు తన జట్టులో చోటివ్వడం కొసమెరుపు. తెలుగు ఆటగాళ్లు సిరాజ్, నితీశ్‌కుమార్‌లకు చోటు దక్కింది.
చోప్రా టీ20 వరల్డ్‌కప్ బృందం: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, జితేశ్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, చాహల్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్.
బెంచ్: మహ్మద్ షమి, కేఎల్ రాహుల్, విప్రజ్ నిగమ్, శశాంక్ సింగ్.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..