Shreyas Iyer: బుమ్రా యార్కర్లకు అయ్యర్ స్ట్రాంగ్ రిప్లై.. అవాక్కైన డివిల్లీర్స్.. వీడియో చూడండి
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:37 PM
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 200 పైగా పరుగులు చేసిన మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదట. దానికి కారణం బుమ్రా, బౌల్ట్ వంటి ప్రతిభావంతమైన బౌలర్లు ఉండడమే. ముఖ్యంగా బుమ్రాను ఎదుర్కొని భారీ స్కోరును ఛేదించడం ఏ బ్యాటర్‌కైనా కష్టమే.
ఐపీఎల్ (IPL 2025) చరిత్రలో ముంబై ఇండియన్స్ 200కు పైగా పరుగులు చేసిన మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదట. దానికి కారణం బుమ్రా, బౌల్ట్ వంటి ప్రతిభావంతమైన బౌలర్లు ఉండడమే. ముఖ్యంగా బుమ్రా (Jasprit Bumrah)ను ఎదుర్కొని భారీ స్కోరును ఛేదించడం ఏ బ్యాటర్‌కైనా కష్టమే. అయితే అంతటి కష్టసాధ్యమైన టాస్క్‌ను చాలా సునాయాసంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పూర్తి చేశాడు. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు (MI vs PBKS).
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ టార్గెట్‌ను పంజాబ్ 19 ఓవర్లలోనే పూర్తి చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన జట్టును గెలిపించాడు. అతడు ముంబై బౌలర్ బుమ్రాను ఎదుర్కొన్న తీరు చాలా మంది మాజీలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. బుమ్రా యార్కర్లను బౌండరీలుగా మార్చిన వైనం చాలా మందిని మెప్పిస్తోంది. బుమ్రా ఫాస్టెస్ట్ యార్కర్‌ను అయ్యర్ ఫోర్ కోట్టిన తీరు అద్భుతం అని మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లీర్స్ ప్రశంసించాడు.
బుమ్రా యార్కర్‌కు అయ్యర్ కొట్టిన ఫోర్ ఈ సీజన్‌లో నా ఫేవరెట్ షాట్ అని చెబుతా. ఒకవేళ నేను ఆ బాల్ ఎదుర్కొని ఉంటే కచ్చితంగా ఔట్ అయ్యేవాడిని. కానీ అంత అద్భుతమైన బంతిని ఫోర్ కొట్టి ముంబై ఇండియన్స్‌పై శ్రేయస్ ఒత్తిడి పెట్టాడు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి బౌలర్‌ను అంత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదు అని డివిల్లీర్స్ అన్నాడు. శ్రేయస్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది.
ఇవీ చదవండి:
చాహల్ గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి