Share News

Shreyas Iyer Asia Cup: అర్హత ఉన్నా అవకాశం రాకపోతే.. ఆసియా కప్‌ ఎంపికపై అయ్యర్ స్పందన..

ABN , Publish Date - Sep 08 , 2025 | 09:23 AM

టీమిండియా తరఫున వన్డేల్లో కీలక ఆటగాడిగా మారిన శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్-2025కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సెలక్షన్ కమిటీ తీరుపై మాజీలు, క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

Shreyas Iyer Asia Cup: అర్హత ఉన్నా అవకాశం రాకపోతే.. ఆసియా కప్‌ ఎంపికపై అయ్యర్ స్పందన..
Shreyas Iyer

టీమిండియా తరఫున వన్డేల్లో కీలక ఆటగాడిగా మారిన శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)ను ఆసియా కప్-2025కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సెలక్షన్ కమిటీ తీరుపై మాజీలు, క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తనను ఆసియా కప్ (Asia Cup 2025) కోసం పరిగణనలోకి తీసుకోకపోవడంపై స్పందించాడు (Shreyas Iyer interview).


'తుది జట్టులో ఉండే అర్హత ఉన్న ఆటగాడిని కనీసం టోర్నీకి కూడా ఎంపిక చేయకపోతే ఎవరికైనా అసహనం కలుగుతుంది. అయినా మన చేతిలో ఏమీ ఉండదు. మన పని మనం నిబద్ధతతో చేసుకుంటూ వెళ్లిపోవడమే. ఎవరో చూస్తున్నారని పని చేయకూడదు. అవకాశం లభించినపుడు ఉత్తమ ప్రదర్శన చేయాలి. జట్టును గెలిపించడానికి ప్రయత్నించాలి' అని అయ్యర్ ఆ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం తన కెరీర్‌లో ఓ మధురానుభూతి అని అయ్యర్ చెప్పాడు (Shreyas Iyer exclusion).


ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు (Shreyas Iyer Asia Cup 2025). అనంతరం జరిగిన ఐపీఎల్‌లో కూడా మెరుగ్గా రాణించాడు. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా రాణించి పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇంత మెరుగైన ప్రదర్శన చేస్తున్న అయ్యర్‌కు టీమిండియా తరఫున అటు టెస్ట్ జట్టులోనూ, ఇటు టీ-20 జట్టులోనూ స్థానం లభించడం లేదు.


ఇవి కూడా చదవండి..

చేతిలో గన్.. ఛేజింగ్.. సరికొత్త అవతారంలో ధోనీ.. టీజర్ అదిరిపోయిందిగా..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 08 , 2025 | 09:23 AM