Share News

Indian Sports Reforms: సాయ్‌ ఆర్థిక పరిస్థితి దారుణం

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:42 AM

భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని క్రీడలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు కేటాయించిన నిధులను తగిన రీతిలో...

Indian Sports Reforms: సాయ్‌ ఆర్థిక పరిస్థితి దారుణం

  • వేధిస్తున్న కోచ్‌ల కొరత

  • పార్లమెంటరీ కమిటీ ఆందోళన

న్యూఢిల్లీ: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని క్రీడలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు కేటాయించిన నిధులను తగిన రీతిలో ఖర్చుచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ నేతృత్వం వహించిన కమిటీలో మాజీ క్రికెటర్‌, ఎంపీ హర్భజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్‌ సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌ పరిస్థితి ఘోరంగా ఉన్నట్టు కమిటీ పరిశీలనలో తేలింది. సాయ్‌కు నిధులతోపాటు కోచ్‌ల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. ఆరునెలల్లో ఆయా ఖాళీలను భర్తీ చేయాలని క్రీడా మంత్రిత్వశాఖకు సూచించింది. ‘ఖేలో ఇండియా’ క్రీడలకు కేటాయించిన నిధులను సాయ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీలకు బదలాయించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. క్రీడలకు బడ్జెట్‌ కేటాయింపులను ఇదే తరహాలో కొనసాగిస్తూనే ‘ఖేలో ఇండియా’ బాధ్యతలను కూడా సాయ్‌కు అప్పగించాలని సలహా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..

Asian Shooting Championship: రష్మికకు స్వర్ణం మనుకు కాంస్యం

India Women Cricket: ప్రపంచకప్‌ జట్టులో శ్రీచరణి

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 21 , 2025 | 03:43 AM